Fish bites Man | బాగా ఆకలి మీద ఉన్న పెద్ద చేప.. ఆటపట్టిస్తున్న మనిషిని చూసి ఒక్కసారిగా ఏం చేసిందంటే?

by Dishanational1 |
Fish bites Man | బాగా ఆకలి మీద ఉన్న పెద్ద చేప.. ఆటపట్టిస్తున్న మనిషిని చూసి ఒక్కసారిగా ఏం చేసిందంటే?
X

దిశ వెబ్ డెస్క్ : సోషల్ మీడియాలో ఏదైనా వీడియో కొంచెం ఆసక్తికరంగా ఉంటే చాలు క్షణాల్లో వైరల్ అయిపోతుంది. ప్రస్తుతం అలాంటి ఒక వైరల్ వీడియోని నెటిజెన్లు తెగ చూసేస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో చూద్దాం రండి.

ఆ వీడియోలో ఓ వ్యక్తి తన ఫ్యామిలీతో సరదాగా ఒక కొలను వద్దకు వచ్చాడు. ఆ కొలనులో బాగా చేపలు ఉన్నాయి. వాటి కోసం ఆహారంగా ఒక చిన్న చేపను తన చేతిలో తీసుకొని ఆటలాడుతుండగా.. నీటిలో నుంచి ఒక పెద్ద చేప అతని వైపు వచ్చింది. ఆ చేప ముందు అటు ఇటు తిరుగుతూ అతడు తనకు ఆహారం ఇస్తాడని ఎదురు చూసింది. కానీ అతను ఆటలాడుతుండడడం చూసి.. ఒక్కసారిగా ఆ చేప నీటిలో నుంచి పైకి లేచి అతని చేతిని గట్టిగా పట్టుకుంది.

అతను ఎంత విడిపించాలనుకున్నా ఆ చేప వదల్లేదు. అతడి చేతిని అలానే కొరికి పట్టుకుంది. అక్కడున్న వాళ్లు విడిపించడానికి ప్రయత్నించినప్పటికీ కొద్దిసేపటి వరకు అతని చేయిని వదిలిపెట్టలేదు. చివరకు అతను ఆ చేపను విడిపించే క్రమంలో కింద మీద పడ్డాడు. చుట్టు పక్క ఉన్న వారంతా అతడి చేయిని విడిపించాలని ప్రయత్నించి విఫలమయ్యారు. చివరికి ఆ చేప తనంట తానే అతడి చేయిని వదిలిపెట్టింది. ఆ చేపను వారంతా పట్టుకోవాలని చూసినా అది మళ్లీ నీళ్లలోకి దూకి వెళ్లిపోయింది.

ఇంటర్నెట్‌లో బాగా వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆకలి మీద ఉన్న ఆ పెద్ద చేప ఆ మనిషి చేయిన తినాలనుకుంది అని ఒక యూజర్ కామెంట్ చేశాడు. ఆసక్తికరంగా ఉన్న ఆ వీడియాని మీరు కూడా తిలకించండి.



Next Story

Most Viewed