- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో మంటలు.. వీడియో వైరల్
డెన్వర్ విమానాశ్రయంలో గురువారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన సిబ్బంది.. వెంటనే ప్రయాణికులు విమానాన్ని ఖాళీ చేయించారు.

దిశ, వెబ్ డెస్క్: డెన్వర్ విమానాశ్రయం (Denver Airport)లో గురువారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం (American Airlines plane)లో మంటలు (fire) చెలరేగడంతో అప్రమత్తమైన సిబ్బంది.. వెంటనే ప్రయాణికులు విమానాన్ని ఖాళీ చేయించారు. గేట్ C38 వద్ద ఆపి ఉంచిన విమానంలో మంటలు మొదలయ్యాయి, టార్మాక్ పైన దట్టమైన నల్లటి పొగ పెరిగిందని విమానాశ్రయ అధికారులు తెలిపారు. అలాగే ఈ మంటల సమాచారం అందుకున్న ఎయిర్ పోర్ట్ సిబ్బంది హుటాహుటిన విమానం వద్దకు చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు, విమాన సిబ్బందిలో ఎవరికీ గాయాలు కాలేదని విమానాశ్రయ అధికారులు తెలిపారు.
ఇంతలో, అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ ౧౦౦౬ (అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 1006)ను దారి మళ్లించి గురువారం సాయంత్రం డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయం (Denver International Airport) లో సురక్షితంగా ల్యాండ్ చేసినట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. ఇదిలా ఉంటే గతకొద్ది రోజులుగా.. అమెరికాలో వరుసగా విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అలాగే ఈ ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో ఓ విమానాన్ని హెలికాఫ్టర్ ఢీకొట్టడంతో ప్రయాణికులు చనిపోయారు. అలాగే ఒకే రన్ వేపైకి వచ్చిన రెండు విమానాలు ఢీకొట్టబోయి వెంట్రుకవాసిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాయి. తాజాగా.. అమెరికా ఎయిర్ లైన్ విమనాంలో మంటలు చెలరేగాయి.






