విమానం గాల్లో ఉండగా అగ్నిప్రమాదం.. బోయింగ్-757 విమానంలో మంటలు.. తర్వాత ఏమైంది?

by Ramesh Naini |   (  Updated:2025-08-18 07:22:58  IST  )

విమానం గాల్లో ఉండగా అగ్నిప్రమాదం సంభవించిన ఘటన నెట్టింట కలకలం సృష్టిస్తోంది.

విమానం గాల్లో ఉండగా అగ్నిప్రమాదం.. బోయింగ్-757 విమానంలో మంటలు.. తర్వాత ఏమైంది?
X

దిశ, డైనమిక్ బ్యూరో: విమానం (Airplane) గాల్లో ఉండగా అగ్నిప్రమాదం సంభవించిన ఘటన నెట్టింట కలకలం సృష్టిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెలితే.. స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి గ్రీస్ నుంచి జర్మనీ వెళ్తున్న (Boeing 757 plane) కాండోర్ బోయింగ్-757 విమానంలో మంటలు చెలరేగాయి. కోర్ఫు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 273 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం గాల్లో ఉండగానే ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. ఇది గమనించిన పైలట్స్ వెంటనే అప్రమత్తమై ఇటలీలోని బ్రిండిసి విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. దీంతో ప్రయాణికులు అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో ప్రయాణికులు, సిబ్బందికి ఎటువంటి గాయాలు కాలేదని సమాచారం.

కోర్ఫు ఎయిర్‌పోర్టులో విమానం టెకాఫ్ అయిన కొద్ది సేపటికి దాదాపు 1,500 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు.. పెద్ద శబ్ధంతో విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ఎయిర్‌పోర్టు సమీపంలోని స్థానికులు, పర్యాటకులు శబ్ధం విని బయటకు వచ్చి అగ్ని ప్రమాద దృశ్యాలు చిత్రీకరించారు. ఇందుకు సంబంధించిన వీడయోలు నెట్టింట వైరల్‌గా మారాయి. పైలట్స్ అప్రమత్తంగా ఉండటంతోనే పెను ప్రమాదం తప్పినట్లైందని నెటిజన్లు పైలట్స్‌ను అభినందించారు. వైరల్ వీడియో..

Read More Cinema News

Read More Life Style news

Next Story