- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పురుషుల మృతదేహాలపై మహిళా డాక్టర్ అసభ్య జోకులు! నెట్టింట తీవ్ర దుమారం
ప్రముఖ కమెడియన్, బిగ్ బాస్ ఫేమ్ ప్రణీత్ మోరే నిర్వహించిన స్టాండప్ కామెడీ షో తీవ్ర వివాదాలకు దారితీస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ కమెడియన్, బిగ్ బాస్ ఫేమ్ ప్రణీత్ మోరే (Pranit More) నిర్వహించిన స్టాండప్ కామెడీ షో తీవ్ర వివాదాలకు దారితీస్తోంది. తాజాగా ఈ షోలో పాల్గొన్న ఓ మహిళా డాక్టర్ మృతదేహాలపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర దుమారం రేపుతున్నాయి.
వివాదం ఏంటంటే..?
ముంబైలోని కేఈఎం (KEM) ఆసుపత్రిలో పనిచేస్తున్న సెజల్ పవార్ (Sejal Pawar) అనే మహిళా డాక్టర్ ప్రణీత్ షోలో పాల్గొని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఆసుపత్రికి వచ్చే పురుషుల మృతదేహాల ప్రైవేట్ భాగాలను చూసి తానూ, తన సహోద్యోగులు సైజ్‌ల గురించి కామెంట్స్ చేసుకుంటూ నవ్వుకుంటామని ఆమె చెప్పింది. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. వైద్య విద్య కోసం ఎంతో ఉదారంగా దానం చేసిన మృతదేహాలను ఇలా అపహాస్యం చేయడం, కంటెంట్ కోసం వాడుకోవడం అత్యంత హేయమని నెటిజన్లు మండిపడుతున్నారు. విమర్శల వెల్లువతో సెజల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ప్రైవేట్‌గా మార్చుకుంది.
ఉద్యోగం కోల్పోయిన యువకుడు..
ఇదే షోలో హిమాన్షు జంగ్రా అనే యువకుడు కూడా మహిళలను కించపరిచేలా మాట్లాడాడు. తాను ఒక అమ్మాయితో డేటింగ్‌కు వెళ్లి రూ.370 పెట్టి బిర్యానీ కొనిచ్చానని, దానికి ప్రతిఫలంగా తాను ఆమె నుంచి కొన్ని ‘రిటర్న్స్’ ఆశించానని చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర దుమారం రేపాయి. ఆ యువకుడి వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం కావడంతో, అతను పనిచేస్తున్న ‘స్టార్విక్ డిజైన్’ కంపెనీ అతన్ని విధుల నుంచి తొలగించింది. ఈ వరుస వివాదాలు, మహిళలను, మృతదేహాలను కించపరిచేలా సాగిన ఈ షోపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడటంతో.. షో నిర్వాహకుడు ప్రణీత్ మోరే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను డీయాక్టివేట్ చేశాడు.






