మిడిల్ ఈస్ట్‌ యుద్ధ భయం : ఇరాన్, ఇజ్రాయెల్‌లోని భారతీయులకు కేంద్రం హై అలర్ట్

by Ramesh Naini |

యుద్ద వాతావరణం నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్‌ దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు (Indian Embassies) కీలకమైన భద్రతా మార్గదర్శకాలను విడుదల చేశాయి.

మిడిల్ ఈస్ట్‌ యుద్ధ భయం : ఇరాన్, ఇజ్రాయెల్‌లోని భారతీయులకు కేంద్రం హై అలర్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. యుద్ద వాతావరణం నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న వేలాది మంది భారతీయుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే ఇరు దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు (Indian Embassies) కీలకమైన భద్రతా మార్గదర్శకాలను విడుదల చేశాయి.

అనవసర ప్రయాణాలు వద్దు: ఎంబసీ హెచ్చరిక

ఇరాన్, ఇజ్రాయెల్‌లోని భారతీయ పౌరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎంబసీ సూచించింది. ప్రస్తుత పరిస్థితులు చక్కబడే వరకు భారతీయులు ఆయా దేశాలకు అనవసర ప్రయాణాలు చేయొద్దని స్పష్టం చేసింది. ఇప్పటికే అక్కడ ఉన్నవారు స్థానిక అధికారుల సూచనలను పాటిస్తూ, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కోరింది.

గల్ఫ్ దేశాల్లోనూ అలర్ట్..

యుద్ధ ప్రభావం పొరుగు దేశాలపై కూడా పడే అవకాశం ఉండటంతో.. యూఏఈ, సౌదీ అరేబియా, జోర్డాన్, కువైట్‌లలోని భారత ఎంబసీలు కూడా రంగంలోకి దిగాయి. అబుదాబిలోని ఎంబసీ, దుబాయ్‌లోని కాన్సులేట్ జనరల్ యథావిధిగా పనిచేస్తాయని అధికారులు తెలిపారు. భారతీయుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చారు. టోల్ ఫ్రీ: 800-46342, వాట్సాప్: 971543090571 ఈమెయిల్: [email protected], [email protected]‌ లను అందుబాటులోకి తెచ్చారు. సౌదీ అరేబియా ఆధ్వర్యంలో రియాద్‌లోని ఎంబసీ భారతీయుల కోసం 24/7 హెల్ప్‌లైన్‌ను ప్రారంభించింది. (ఫోన్: 00-966-11-4884697, టోల్ ఫ్రీ: 800 247 1234) లను అందుబాటులోకి తీసుకొచ్చింది. జోర్డాన్‌ పరిధిలో పర్యాటకులు, స్థానిక భారతీయులు అత్యవసర పరిస్థితుల్లో 00962-770 422 276 నంబర్‌ను సంప్రదించాలని కోరింది. కువైట్ పరిధిలో అక్కడి ప్రభుత్వం జారీ చేసే అధికారిక భద్రతా నిబంధనలను తప్పకుండా పాటించాలని అక్కడి భారత రాయబార కార్యాలయం విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతానికి అన్ని దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయి. భారతీయ పౌరులు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా, ఎంబసీ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా అందే అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని విదేశాంగ శాఖ కోరింది.

Next Story