వర్జీనియాలో దారుణం.. కూతురిపై అత్యాచారం చేసిన కన్న తండ్రి.. పదేళ్లుగా నరకం..

by Sujitha Rachapalli |

వర్జీనియాలో జరిగిన సంఘటన మానవత్వానికే మచ్చగా మారింది. కనీసం కన్న కూతురు అని కూడా జాలి చూపకుండా.. పదేళ్లుగా ఆమెపై అత్యాచారం చేస్తున్నాడు తండ్రి. పాప తొమ్మిదేళ్ల వయసు నుంచి ఈ పాడు పని మొదలుపెట్టిన తండ్రి..

వర్జీనియాలో దారుణం.. కూతురిపై అత్యాచారం చేసిన కన్న తండ్రి.. పదేళ్లుగా నరకం..
X

దిశ, వెబ్ డెస్క్: వర్జీనియాలో జరిగిన సంఘటన మానవత్వానికే మచ్చగా మారింది. కనీసం కన్న కూతురు అని కూడా జాలి చూపకుండా.. పదేళ్లుగా ఆమెపై అత్యాచారం చేస్తున్నాడు తండ్రి. పాప తొమ్మిదేళ్ల వయసు నుంచి ఈ పాడు పని మొదలుపెట్టిన తండ్రి.. 21 ఏళ్లు వచ్చే వరకు నరకం చూపించాడు. ఈ కారణంగా పాప ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిందని కూడా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కేసు ట్రయల్‌లో ఉండగా.. ఇంటర్నేషనల్ మీడియా హెడ్ లైన్స్ టచ్ చేసింది.

44ఏళ్ల వయసున్న కెన్నెత్ రే రుక్.. వెస్ట్ వర్జీనియాలోని రౌలీ కౌంటీలో నివాసం ఉంటాడు. 2012లో తన కూతురు తొమ్మిదేళ్ల వయసు ఉన్నప్పటి నుంచి 21ఏళ్ల వరకు ఆమెను రేప్ చేస్తూనే ఉన్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా ముగ్గురు పిల్లలు పుట్టారని.. నిర్లక్ష్య స్థితిలో ఉన్నారని గుర్తించారు. ప్రస్తుతం దాదాపు 152 ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. వీటిలో 149 ఇన్సెప్ట్ అలిగేషన్స్ కాగా లైంగిక వేధింపులు, లైంగిక దాడి, చిన్నారి పట్ల నిర్లక్ష్యం కూడా ఉన్నాయి. ఈ నేరాలపై కుక్ మార్చి నుంచి సదరన్ రీజనల్ జైలులో ఊచలు లెక్కపెడుతున్నాడు.

Next Story