- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గరుడ-25: గగనతలంలో భారత్-ఫ్రాన్స్ అద్భుత వైమానిక విన్యాసాలు.. ఐఏఎఫ్ ట్వీట్
ఫ్రాన్స్ గగనతలంలో భారత్-ఫ్రాన్స్ దేశాలు అధ్భుతంగా వైమానిక విన్యాసాలు నిర్వహిస్తున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఫ్రాన్స్ గగనతలంలో భారత్-ఫ్రాన్స్ దేశాలు అధ్భుతంగా వైమానిక విన్యాసాలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు సోమవారం ఎక్స్ వేదికగా (Indian Air Force) ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ట్వీట్‌లో ఫోటోలను పంచుకుంది. గరుడ-25 #ExerciseGaruda25 లో భాగంగా భారత్, ఫ్రాన్స్ వైమానిక దళాలు సంయుక్తంగా ద్వైపాక్షిక వైమానిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. నవంబర్ 16 నుండి 27 వరకు ఫ్రాన్స్‌లోని మోంట్-డి-మార్సన్ వైమానిక స్థావరంలో ఈ విన్యాసాలు జరుగుతున్నాయి. ఇది రెండు దేశాల మధ్య బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా విన్యాసాలు నిర్వహించారు.
విన్యాసాల్లో భాగంగా ఇవాళ భారత్‌కు చెందిన సుఖోయ్–30 ఎంకేఐ యుద్ధవిమానాలు, ఫ్రాన్స్ ఎయిర్ అండ్ స్పేస్ ఫోర్స్‌కు చెందిన రఫేల్ ఫైటర్ జెట్లు ఆకాశంలో కలిసి ఎగసి, సమన్వయ మిషన్‌లను ప్రారంభించాయి. ఈ విన్యాసాలు రెండు దేశాల మధ్య ఉన్న పరస్పర రక్షణ సహకారం, ఆపరేషనల్ ఇంటర్ ఆపరబిలిటీను మరింత బలోపేతం చేస్తుందని ట్వీట్‌లో ఐఏఎఫ్ పేర్కొంది. సంక్లిష్ట సమయంలో సంయుక్త దాడులు, గగనతల రక్షణ వ్యూహాలు, బహుళ-విమాన సమన్వయం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టితో వైమానిక శిక్షణలు కొనసాగుతున్నాయని అధికారుల సమాచారం. ట్వీట్ ఇదే..






