భూకంపం ఎఫెక్ట్.. బద్దలైన అగ్నిపర్వతాలు

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-08-04 12:54:23  IST  )

రష్యాలోని కురిల్ దీవుల్లో ఆదివారం సంభవించిన భూకంపం (Russia Earthquake) తీవ్రత ధాటికి రెండు అగ్ని పర్వతాలు బద్దలైనట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి.

భూకంపం ఎఫెక్ట్.. బద్దలైన అగ్నిపర్వతాలు
X

దిశ, వెబ్‌డెస్క్: రష్యాలోని కురిల్ దీవుల్లో ఆదివారం సంభవించిన భూకంపం (Russia Earthquake) తీవ్రత ధాటికి రెండు అగ్ని పర్వతాలు బద్దలైనట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. కమ్చట్కా ద్వీపకల్పంలోని క్రాషెన్నినికోవ్ అగ్నిపర్వతం బద్దలైంది. సుమారు 600 ఏళ్ల తర్వాత తొలిసారి ఈ అగ్నిపర్వతం బద్దలైనట్లు రష్యా ఎమర్జెన్సీ మంత్రిత్వశాఖ పేర్కొంది. అగ్నిపర్వతం పేలడంతో 6 వేల మీటర్ల ఎత్తు వరకూ బూడిద ఎగసిపడిందని వివరించింది. కాగా.. మరో ఘటనలో కమ్చట్కా ద్వీపకల్పంలోని అత్యంత చురుకైన అగ్నిపర్వతమైన క్ల్యూచెస్కీ కూడా బద్దలైనట్లు మీడియా వర్గాలు పేర్కొన్నాయి.

రష్యాలో ఇటీవల 8.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించగా.. రష్యా సహా జపాన్, నార్త్ పసిఫిక్ తీరప్రాంతాలను సునామీ తాకింది. 2011 తర్వాత పసిఫిక్ ప్రాంతంలో వచ్చిన అత్యంత భారీ భూకంపమని నిపుణులు పేర్కొన్నారు.

Next Story