ఛత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్

by Elthuri vijay kumar |

మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాల వేళ మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాలోని అబూజ్ మాడ్ అడవుల్లో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు.

ఛత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్
X

ఛత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్

ఇద్దరు మావోయిస్టులు మృతి

మృతులలో కేంద్ర కమిటీ సభ్యుడు వికల్ప్..?

దిశ భద్రాచలం : మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాల వేళ మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాలోని అబూజ్ మాడ్ అడవుల్లో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. కాగా మృతుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు వికల్ప్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఘటనా స్థలం నుండి ఏకే-47తో పాటు పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు బస్తర్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయు.

Next Story