- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హర్మూజ్ గుండా వెళ్లే నౌకలపై టోల్ ఫీజు.. ఇరాన్ ఎంబసీ క్లారిటీ
హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకల నుంచి 2 మిలియన్ డాలర్లు వసూలు చేస్తోందన్న ఆరోపణలను ఇండియాలోని ఇరాన్ రాయబార కార్యాలయం ఖండించింది.

Strait of Hormuz
దిశ, వెబ్ డెస్క్: ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధానికి తాత్కాలిక బ్రేక్ పడింది. పశ్చిమాసియా యుద్ధానికి స్వయంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విరామం ఇచ్చారు. ఇరాన్ దేశంతో నిర్ణయాత్మక చర్చలు జరుగుతున్నాయని, రెండు గడిచిన రెండు రోజులుగా జరిగిన ఈ చర్చల కారణంగా ఇరాన్ పైన దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటన చేశారు ట్రంప్. దీంతో జనాలందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఇది ఇలా ఉండగా, హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకల ద్వారా 2 మిలియన్ డాలర్లు ఇరాన్ వసూలు చేస్తోందన్న వార్త చెక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలపై ఇండియాలోని ఇరాన్ రాయబార కార్యాలయం స్పందించింది. హర్ముజ్ జలసంధి మీదుగా వెళ్లే నౌకల నుంచి 2 మిలియన్ డాలర్ల చొప్పున టోల్ ఫీజు వసూలు చేస్తున్నామన్నది ఏ మాత్రం వాస్తవం కాదని క్లారిటీ ఇచ్చింది ఇరాన్ ఎంబసీ. ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండించింది. టోల్ ఫీజు విషయంలో తమ అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదని క్లారిటీ ఇచ్చింది.
ఇరాన్ లో ఉన్న కొంత మంది రాజకీయ నాయకులు దీనిపై సొంత అభిప్రాయాలను వెలుబుచ్చారు, కానీ దీనిపై ఇరాన్ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది రాయబార కార్యాలయం. కొంతమంది వ్యక్తిగత అభిప్రాయాలు చెబితే, ఇరాన్ ప్రభుత్వానికి ఏం సంబంధం ? అని ప్రశ్నించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా వాళ్ళు మాట్లాడతారు.. వాళ్ల మాటలు పట్టించుకోకూడదని కోరింది. ఇప్పటి వరకు ఇరాన్ సర్కార్ దీనిపై నిర్ణయం తీసుకోలేదని క్లారిటీ ఇచ్చింది ఎంబసీ.






