ఎలన్ మస్క్ నా తండ్రి.. అచ్చం ఆయన పోలికలతో షాక్ ఇచ్చిన కుర్రాడు..

by Sujitha Rachapalli |   (  Updated:2025-08-06 09:40:13  IST  )

కెన్యాకు చెందిన కుర్రాడు.. తాను బిలియనీర్ ఎలన్ మస్క్ కొడుకునంటూ వైరల్ అవుతున్నాడు. మసాయి మారాలోని ఓ హోటల్‌లో పని చేస్తున్నప్పుడు మస్క్ తన తల్లిని కలిశాడని.. వారిద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడిందని.. దీని వల్ల తాను పుట్టానని చెప్పుకొచ్చాడు.

ఎలన్ మస్క్ నా తండ్రి.. అచ్చం ఆయన పోలికలతో షాక్ ఇచ్చిన కుర్రాడు..
X

దిశ, వెబ్ డెస్క్ : కెన్యాకు చెందిన కుర్రాడు.. తాను బిలియనీర్ ఎలన్ మస్క్ కొడుకునంటూ వైరల్ అవుతున్నాడు. మసాయి మారాలోని ఓ హోటల్‌లో పని చేస్తున్నప్పుడు మస్క్ తన తల్లిని కలిశాడని.. వారిద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడిందని.. దీని వల్ల తాను పుట్టానని చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన న్యూస్ ట్రెండింగ్‌లో ఉండగా.. కానీ ఇదంతా కరెక్ట్ కాదని అంటున్నారు జనాలు. ఈ వ్యక్తి వయసు నలభై సంవత్సరాలు కాగా.. మస్క్ ఏజ్ 54. అంటే తన తల్లిని 14ఏళ్ల వయసులోనే కలిస్తే.. పిల్లలు ఎలా పుడుతారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

మరోవైపు ఇదంతా ఏఐ మాయాజాలమని.. మస్క్ పోలికలతో ఉన్న నల్లజాతి కుర్రాడి ఫొటోను తయారు చేసి ఇలా ప్రచారం చేస్తున్నారనే వాదన ఉంది. సెలబ్రిటీ బ్లాక్ వెర్షన్ ట్రెండ్‌లో భాగంగా ఇదంతా జరుగుతుందని అనుమానిస్తున్నారు. ఆఫ్రికన్ హబ్‌లో ఇలాంటి నకిలీ వార్తలు చాలా వచ్చాయని.. ఆ తర్వాత రష్యన్ వెబ్ సైట్స్‌లో ప్రచురితమయ్యాయని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Next Story