- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Eggs Prices : దేశంలో కోడిగుడ్ల షార్టేజ్.. భారీగా పెరగనున్న ధరలు
ప్రపంచంలోనే మేటి అయిన దేశంలో ప్రస్తుతం కోడిగుడ్ల కరువు(Eggs Shortage) ఏర్పడింది.

దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచంలోనే మేటి అయిన దేశంలో ప్రస్తుతం కోడిగుడ్ల కరువు(Eggs Shortage) ఏర్పడింది. అనేక షాపుల ముందు "లిమిటెడ్ స్టాక్"(Limited Stock) అని, "నో ఎగ్స్"(NO Eggs) అని బోర్డులు దర్శనం ఇస్తున్నాయి. అవును.. ఇది నిజం. ప్రపంచ అగ్రదేశం అయిన అమెరికా(USA) ప్రస్తుతం కోడిగుడ్ల షార్టేజ్ ను ఎదుర్కొంటోంది. కోడిగుడ్ల ధరలు విపరీతంగా పెరిగిపోతున్న కారణంగా.. ప్రజలు అధిక మొత్తంలో గుడ్లను కొనుగోలు చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే కోడిగుడ్ల ధరలు 15 శాతం పెరగగా అది 20 శాతానికి పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత జనవరిలో అమెరికాలో డజను గుడ్ల ధర 2.52 డాలర్లు ఉండగా ప్రస్తుతం అది 4.15 డాలర్లకు పెరిగి.. త్వరలోనే అది 7.34 డాలర్లకు పెరగనుందని సమాచారం. దీంతో కోడిగుడ్ల అమ్మకాలపై అమెరికాలో పరిమితులు విధించారు. ఒక్కో స్టోర్ కి కేవలం రెండు మూడు ట్రేలు మాత్రమే సప్లై చేస్తుండటంతో.. అవి కూడా వచ్చీ రాగానే అయిపోతుండగా.. ఎక్కడ చూసినా నో స్టాక్ బోర్డులు దర్శనం ఇస్తున్నాయి.
అయితే గత కొంతకాలంగా అమెరికాలో బర్డ్ ఫ్లూ(Bird Flu) విపరీతంగా పెరగడమే ఈ షార్టేజికి కారణం అని తెలుస్తోంది. బర్డ్ ఫ్లూ వ్యాప్తి వలన గత డిసెంబరు ఒక్కనెలలోనే దాదాపు 2.3 కోట్ల కోళ్లను వెటర్నరీ అధికారులు కాల్చివేశారు. దీంతో ప్రస్తుతం అమెరికాలో అటు చికెన్ ధరలు, కోడిగుడ్ల ధరలు అమాంతం చుక్కలను తాకుతున్నాయి. కాగా ఎగ్స్ ధరలపై స్టోర్లలోనే కాకుండా ఆన్లైన్ అమ్మకాలపై కూడా పడింది. ఒక్కో ఆర్డర్ పై ఒకరికి ఒక రోజుకు డజన్ గుడ్లు మాత్రమే అమ్ముతున్నారు. ఇక రెస్టారెంట్లలో కూడా కోడిగుడ్డు సంబంధిత పదార్థాలపై అధిక ధరలు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. రానున్న రోజుల్లో అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో ఎగ్స్ ధరలు మరింత గరిష్టానికి చేరడం ఖాయం అనిపిస్తోంది.






