Earthquake in Afghanistan: ఆప్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. 950 మంది మృతి!

by Disha Web Desk 12 |
Earthquake in Afghanistan, Deaths may increase
X

కాబూల్‌: Earthquake in Afghanistan, Deaths may increase| ఆఫ్ఘనిస్తాన్‌లో ఘోరం భూకంపం వందలాది మంది ప్రాణాలను బలితీసుకుంది. తాజా గణాంకాల ప్రకారం 950 మందిని ఈ భూకంపం పొట్టన పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరుగుతుందని అంచనా. అసలే ఆర్థిక సంక్షోభంలో కునారిల్లుతున్న ఆప్ఘన్‌ని ప్రకృతి కూడా కరుణించడంలేదు. అఫ్గన్‌ తూర్పు ప్రాంతమైన పాక్‌టికా ప్రావిన్స్‌ కేంద్రంగా.. రిక్టర్‌ స్కేల్‌పై 6.1 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఆఫ్ఘనిస్తాన్ చరిత్రలో కనీవినీ ఎరుగని ఈ ఘోర భూకంపం ప్రభావం వల్ల ఆప్ఘనిస్తాన్, పాకిస్తాన్, భారత్‌‌లో 500 కిలోమీటర్ల పొడవునా భూమి కంపించింది. ఖోస్ట్ నగరం నుంచి పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో 44 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదైందని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది.

దేశంలోని నాలుగు జిల్లాల్లో డజన్ల కొద్దీ ఇళ్లు దెబ్బతినగా.. వందల సంఖ్యలో పౌరులు గాయపడ్డారు. రాళ్లతో నిర్మించిన ఇళ్లు కావడంతో తీవ్ర గాయాలతో చాలా మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హెలికాప్టర్‌ల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. వీలైన రీతిలో సాయానికి ముందుకు రావాలని అంతర్జాతీయ సమాజానికి తాలిబన్‌ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. మరోవైపు అఫ్గనిస్థాన్‌తో పాటు పాకిస్థాన్‌లోనూ భూకంపం సంభవించింది. తూర్పు ఆప్ఘాన్‌లోని పాక్టికా ప్రావిన్స్‌లోనే ఎక్కువమంది ప్రజలు భూకంప ప్రభావానికి గురై చనిపోయారని అధికారులు నిర్ధారించారు. ఇక్కడ 255 మంది ప్రజలు దుర్మరణం కాగా 200 మంది గాయపడ్డారని తాజా సమాచారం. ఇంకా డజన్ల సంఖ్యలో ఇళ్లు కుప్పగూలిపోవడంతో అనేకమంది మట్టి దిబ్బల కింద కూరుకుపోయి ఉంటారని భీతిల్లుతున్నారు.


Next Story

Most Viewed