- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాతబస్తీలో కేటీఆర్ సందడి.. చార్మినార్ వద్ద ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కెట్ తింటూ ముచ్చట!
by Ramesh Naini |
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం చార్మినార్ వద్ద సందడి చేశారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం చార్మినార్ వద్ద సందడి చేశారు. పాతబస్తీ పర్యటనకు వెళ్లిన ఆయన చార్మినార్‌కు ఆనుకుని ఉండే ప్రసిద్ధ నిమ్రా కేఫ్ అండ్ బేకరీని సందర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. హైదరాబాద్ పాతబస్తీకి వెళ్లినప్పుడు అక్కడి ఇరానీ చాయ్ తాగకపోతే ఆ పర్యటనకు సంపూర్ణత్వమే ఉండదని పేర్కొన్నారు. చార్మినార్ పక్కనే ఉన్న ప్రముఖ నిమ్రా కేఫ్‌ను సందర్శించి, ఇక్కడి రుచికరమైన ఉస్మానియా బిస్కెట్లు, ఇరానీ చాయ్‌ని ఆస్వాదించానని తెలిపారు. కేటీఆర్ పాతబస్తీ రాకతో చార్మినార్ పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది.
Next Story






