- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
plane crash: విమానం కూలిన ప్రాంతంలో డీవీఆర్ స్వాధీనం
అహ్మదాబాద్‌లో గురువారం కూలిన ఎయిర్ ఇండియా విమానం (Air India plane crash) శిథిలాల నుంచి డిజిటల్ వీడియో రికార్డర్ (డీవీఆర్) గుజరాత్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: అహ్మదాబాద్‌లో గురువారం కూలిన ఎయిర్ ఇండియా విమానం (Air India plane crash) శిథిలాల నుంచి డిజిటల్ వీడియో రికార్డర్ (డీవీఆర్) గుజరాత్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ‘ఇది ఒక డీవీఆర్ అని దీన్ని శిథిలాల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు ఏటీఎస్ అధికారి మీడియాకు తెలిపారు. ఫోరెన్సిక్ ల్యాబ్ బృందం కూడా రానున్నట్లు పేర్కొన్నారు. డిజిటల్ వీడియో రికార్డర్ (డీవీఆర్)ను పరిశీలిస్తే ప్రమాదం ఎలా జరిగిందో అనే విషయం కాస్తైనా తెలిసే అవకాశం ఉంది.
అన్ని కోణాల్లో దర్యాప్తు
బోయింగ్ డ్రీమ్‌లైనర్ 787-8 విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన కొన్ని క్షణాల్లోనే మెడికల్ కాలేజీ బిల్డింగ్‌పై కూలిపోయి పేలిపోయిన విషయం తెలిసిందే. దిగ్భ్రాంతి కలిగించిన ఈ విమాన ప్రమాదంపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. విమానం పడిపోయిన సందర్భంలో ఏకంగా ఆ ప్రాంతంలో 1000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత పుట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఒకే ఒక్క వ్యక్తి ప్రాణాలతో బయటపడగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బ్లాక్ బాక్స్ జాడ కూడా ఇంకా దొరకలేదు. ఘటన స్థలం పూర్తిగా కాలిపోవడంతో సహాయక చర్యలకు సంబంధించి పనులు కొనసాగుతున్నాయి. మృతులను గుర్తించే పనిలో అధికారులు తలమునకలయ్యారు.






