కమలా హారిస్ నవ్వుపై.. డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత విమర్శలు

by Geesa Chandu |

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్... డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ నవ్వుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

కమలా హారిస్ నవ్వుపై.. డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత విమర్శలు
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్... డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ నవ్వుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ పెన్సిల్వేనియాలోని విల్కేస్ బారేలో.. జరిగిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. "కమలా హారిస్ పై తీవ్ర విమర్శలు చేశారు. అలాగే అమెరికాలోని ప్రధాన పత్రికలపై కూడా విమర్శలు గుప్పించారు. అయితే, కమలా హారిస్ నవ్వటం పై కూడా నిషేధం ఉందని, దీంతో ఆమె నోరు మూసుకుని తిరుగుతోందని, ఆమె నవ్వాలని తాను కూడా కోరుకుంటున్నానని వెటకారంగా మాట్లాడారు. అంతే కాకుండా టైం మ్యాగజైన్ వద్ద అసలు కమలా హారిస్ ఫోటోలు కూడా లేవని, వారి వద్ద ఉన్న కళాకారులు మాత్రమే ఆమె బొమ్మలు గీస్తారని అన్నారు. కమలా హారిస్ ఎప్పుడూ చెత్తగా మాట్లాడుతారని.. ఆమెకు ఏ విషయాల పట్ల కనీస అవగాహన కూడా ఉండదని అన్నారు. ముఖ్యంగా కమలా హారిస్ మార్క్సిస్టు పాలసీలను అనుసరిస్తారని, ఆమె తండ్రి కూడా ఒక మార్క్సిస్ట్ ఎకనామిక్ ప్రొఫెసర్ అని తెలిపారు. అయితే అమెరికా కలలను.. జో బైడెన్-కమలా హారిస్ ఇద్దరూ కలిసి చంపేశారని తీవ్ర విమర్శలు" గుప్పించారు.

Next Story