- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘భారీ మూల్యం తప్పదు’.. ఇరాన్‌కు డోనాల్డ్ ట్రంప్ మరోసారి వార్నింగ్
అమెరికా ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల వేళ ట్రంప్ శత్రుదేశానికి మరోసారి వార్నింగ్ ఇచ్చాడు. డీల్ కుదుర్చుకోకుండా ఇరాన్ ఆలస్యం చేస్తోందని, ఇప్పటికే ఆ దేశం సైనికపరంగా తీవ్రంగా నష్టపోయిందని పేర్కొన్నారు.

దిశ, వెబ్ డెస్క్: అమెరికా ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల వేళ ట్రంప్ శత్రుదేశానికి మరోసారి వార్నింగ్ ఇచ్చాడు. డీల్ కుదుర్చుకోకుండా ఇరాన్ ఆలస్యం చేస్తోందని, ఇప్పటికే ఆ దేశం సైనికపరంగా తీవ్రంగా నష్టపోయిందని పేర్కొన్నారు. బహ్రెయిన్, కువైట్, జోర్డాన్ లలోని అమెరికా స్థావరాలపై దాడులు చేసినందుకు ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ట్రంప్ ఘాటుగా హెచ్చరించారు. ఒకవేళ ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండి ఉంటే ఇజ్రాయెల్, మధ్యప్రాచ్య దేశాలు ఉండేవి కావన్నారు. వాళ్లు ఖచ్చితంగా దాడి చేసేవాళ్లని, ఏం జరుగుతుందో చూద్దామని వ్యాఖ్యానించారు. కానీ నిన్న ఇరాన్ ను గట్టిగా దెబ్బ కొట్టామని, ఈ రోజు కూడా వారిని మళ్లీ గట్టిగా దెబ్బకొట్టబోతున్నామని హెచ్చరించారు.
తాము ఒప్పందానికి సిద్ధంగా ఉన్నా, వారు సాగదీస్తూనే ఉన్నారని చెప్పారు. వాళ్లు మమ్మల్ని వెర్రివాళ్లలా ఆడుకుంటున్నారని మండిపడ్డారు. ఎందుకంటే వాళ్లు చాలా తెలివితక్కువ అధ్యక్షులు ఉన్నారని అన్నారు. ఇది చెప్పడానికి చాలా సిగ్గుగా ఉందని, చాలా తెలివితక్కువ వ్యక్తులు అక్కడ కూర్చుని ఉన్నారని వ్యాఖ్యానించారు. అమెరికాకు చెందిన అపాచీ హెలికాప్టర్ ను ఇరాన్ కూల్చివేయడం వల్లే తిరిగి ఆర్మీ దాడికి దిగాల్సి వచ్చిందని చెప్పారు. వాళ్లు దాడి చేశారు కాబట్టి మాకు కూడా ఆ హక్కు ఉంది అంటూ ట్రంప్ మండిపడ్డారు.






