- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పిల్లల ఔషధాల పై నిర్లక్ష్యం ?
అనంతగిరి మండలం పాలవరం గ్రామంలోని తాత్కాలిక గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో చిన్నపిల్లల కోసం వినియోగించే సిరప్స్ గత కొన్ని నెలలుగా నిర్లక్ష్యంగా వ్యర్థంగా పడివున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

దిశ, అనంతగిరి : అనంతగిరి మండలం పాలవరం గ్రామంలోని తాత్కాలిక గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో చిన్నపిల్లల కోసం వినియోగించే సిరప్స్ గత కొన్ని నెలలుగా నిర్లక్ష్యంగా వ్యర్థంగా పడివున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. పిల్లల ఆరోగ్యానికి సంబంధించిన ఈ సిరప్స్ సరైన భద్రతా చర్యలు లేకుండా, వినియోగంలోకి తీసుకురాకుండా అలాగే ఉంచినట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. వాటిలో కొన్ని ఔషధాల వాడకం గడువు వచ్చే నెలలో ముగియనున్నప్పటికీ ఇప్పటికీ వాటి పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామంలో ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన మందులు ఇలా నిర్లక్ష్యంగా ఉండటం పట్ల స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లల ఔషధాలు కావడంతో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి ఈ అంశం పై పరిశీలన జరిపి, మందుల నిల్వ, వినియోగం పై స్పష్టత ఇవ్వాలని గ్రామస్థులు కోరుతున్నారు.






