కేరళంలో మరోసారి నిఫా కలకలం.. ఆసుపత్రి సిబ్బంది క్వారంటైన్‌కు!

by Prasad Jukanti |

రళలోని కోజికోడ్‌లో 43 ఏళ్ల వ్యక్తికి ప్రాథమిక పరీక్షల్లో నిఫా పాజిటివ్‌గా తేలింది. దీంతో ట్రేసింగ్ బృందాలు రంగంలోకి దిగాయి.

కేరళంలో మరోసారి నిఫా కలకలం.. ఆసుపత్రి సిబ్బంది క్వారంటైన్‌కు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేరళంలో (Keralam) మరోసారి నిఫా వైరస్ (Nipah Virus) కలకలం సృష్టిస్తోంది. తాజాగా కోజికోడ్ జిల్లా ఫెరోక్‌కు చెందిన 43 ఏళ్ల వ్యక్తికి నిర్వహించిన ప్రాథమిక పరీక్షల్లో నిఫా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. కోజికోడ్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో నిర్వహించిన వైద్య పరీక్షలో ఈ విషయం వెల్లడైంది. దీంతో అతడి శాంపిల్స్ పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV)కి పంపించగా ఇందుకు సంబంధించిన నివేదిక ఇవాళ రానుంది. సదరు వ్యక్తి గిడ్డంగిని శుభ్రం చేస్తున్నప్పుడు ఈ ఇన్ఫెక్షన్ సోకి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.

కాంటాక్ట్ ట్రేసింగ్ షురూ.. ఆసుపత్రి సిబ్బంది క్వారంటైన్‌కు!

సదరు రోగి నిఫా నిర్ధారణకు ముందు చాలా మందితో సన్నిహితంగా మెలిగినట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో అతడు ఎవరెవరిని కలిశారో గుర్తించేందుకు కాంటాక్ట్ ట్రేసింగ్ (Contact Tracing) కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. దీనిపై కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కె.మురళీధరన్ స్పందిస్తూ.. బాధితుడు మొదట చికిత్స పొందిన ప్రైవేట్ ఆసుపత్రిలోని పలు విభాగాలను సందర్శించాడని కాబట్టి అతను చాలా మందితో పరిచయం కలిగి ఉండే అవకాశం ఉందని తెలిపారు. అయితే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ముందస్తు జాగ్రత్త చర్యగా, రోగితో సన్నిహితంగా మెలిగిన ఆసుపత్రి సిబ్బందిని క్వారంటైన్‌లోకి వెళ్లమని కోరినట్లు మంత్రి తెలిపారు. అలాగే అతనితో కాంటాక్ట్ అయిన ఇతరులను గుర్తించేందుకు (Contact Tracing) ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.

Next Story