- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాలయ్య - వివేక్ ఆత్రేయ కాంబో మూవీ క్యాన్సల్ కాలేదు.. అసలు కథ ఇదే
బాలయ్య - వివేక్ ఆత్రేయ కాంబో మూవీ క్యాన్సల్ కాలేదని, ఇటీవల వివేక్ చెప్పిన కథ లైన్ బాలయ్యకు నచ్చినట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్నట్లు గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మించనున్నట్లు, బాలయ్యను సరికొత్తగా చూపించే ప్రయత్నంలో వివేక్ ఉన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అంతేకాకుండా ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించనున్నారని, అందుకు భారీ బడ్జెట్ అవసరమవుతుందని కూడా వార్తలు వినిపించాయి. అయితే ఈ కాంబో దాదాపు ఖరారైందని భావిస్తున్న సమయంలో బడ్జెట్ ఎక్కువ కావడంతో మేకర్స్ వెనక్కి తగ్గినట్లు, దీంతో వివేక్ ఆత్రేయ, రవితేజతో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి.
దీంతో బాలయ్య - వివేక్ ఆత్రేయ ప్రాజెక్ట్ నిలిచిపోయిందనే ప్రచారం కూడా జరిగింది. ఇలాంటి సమయంలో తాజాగా ఈ కాంబో మూవీకి సంబంధించిన మరో ఆసక్తికర వార్త తెరపైకి వచ్చింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం కొంతకాలం క్రితం వివేక్ ఆత్రేయ, బాలకృష్ణకు ఓ కథ లైన్ వినిపించగా అది బాలయ్యకు నచ్చినట్లు తెలుస్తోంది. అనంతరం పూర్తి కథను సిద్ధం చేయాలని బాలయ్య సూచించినట్లు సమాచారం. దీంతో వివేక్ ఆత్రేయ ప్రస్తుతం పూర్తి కథపై పని చేస్తూనే ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా ప్రారంభించినట్లు టాక్ వినిపిస్తోంది. మరికొంతకాలంలోనే బాలకృష్ణ హీరోగా, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ సినిమా అధికారికంగా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.






