- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అకాల వర్షం.. గాలి దుమారానికి విరిగిపోయిన విద్యుత్ స్తంభాలు
అకాల వర్షం, గాలి దుమారం కారణంగా ఏన్కూర్ మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు విరిగి నేలకూలాయి.

X
దిశ, ఏన్కూర్ : అకాల వర్షం, గాలి దుమారం కారణంగా ఏన్కూర్ మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు విరిగి నేలకూలాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పాటు విద్యుత్ శాఖకు లక్షల్లో నష్టం వాటిల్లింది. మండల విద్యుత్ శాఖ ఏఈ ఉమాకాంత్ ఆధ్వర్యంలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు. విద్యుత్ శాఖ సిబ్బంది రాత్రింబవళ్లు శ్రమించి, విరిగిపోయిన స్తంభాల స్థానంలో తాత్కాలిక ఏర్పాట్లు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. గాలి దుమారం కారణంగా నేలకూలిన స్తంభాలను తొలగించే క్రమంలో రాత్రి వేళల్లో సిబ్బంది ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు. అకాల వర్షం, గాలి దుమారం ప్రజలను ఇబ్బందులకు గురి చేయడంతో పాటు విద్యుత్ శాఖకు కూడా గణనీయమైన నష్టం కలిగించిందని స్థానికులు అభిప్రాయపడ్డారు.
Next Story






