- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైవేపై ఎదురెదురుగా ఢీకొన్న కార్లు.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు
సాగర్ హైవే పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

దిశ, ఇబ్రహీంపట్నం : సాగర్ హైవే పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వెళ్తున్న రెండు కార్లు ఢీ కొనడంతో ఒకరి పరిస్థితి విషమంగా మారగా, పలువురికి తీవ్ర గాయాలైన ఘటన మంచాల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆగపల్లి గ్రామ శివారులోని నాగార్జున సాగర్ హైవేపై గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైవే పై రెండు కార్లు ఎదురెదురుగా ఢీ కొనడంతో ఒకరి పరిస్థితి విషమంగా మారింది. మరికొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి. అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ప్రమాద తీవ్రతకు రెండు కార్లు నుజ్జునుజ్జవగా ప్రయాణికులు గాయాలతో బయటపడ్డారు. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వడంతో క్షతగాత్రులను 108 అంబులెన్స్ ద్వారా ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సింది.






