ఇరాన్‌పై భీక‌ర్ యుద్ధం.. బైబిల్ ను వాడేసిన ట్రంప్ !

by velandi.Saikiran |

ఇరాన్ పై దాడులను సమర్ధించుకునే క్రమంలో సైనికులకు మత సిద్ధాంతాలను అమెరికా ఎక్కించినట్లు రిపోర్ట్స్ స్పష్టం చేస్తున్నాయి.

ఇరాన్‌పై భీక‌ర్ యుద్ధం.. బైబిల్ ను వాడేసిన ట్రంప్ !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఇరాన్ ను టార్గెట్ చేసి ఇజ్రాయెల్, అమెరికా చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 5 రోజులుగా ఇరాన్ కు నిద్ర లేకుండా చేస్తున్నాయి ఇజ్రాయెల్, అమెరికా. దానికి తగ్గట్టుగానే ఇరాన్ రిప్లై ఇస్తున్నప్పటికీ, చాలా మంది సైనికులను కోల్పోయింది. తాజాగా ఇరాన్ సుప్రీం ఖ‌మేనీ కూడా మరణించారు. అయితే ఇలాంటి నేపథ్యంలో ఓ షాకింగ్ నిజం బయటకు వచ్చింది. ఇరాన్ పై యుద్ధం చేసే క్రమంలో మతం రంగును అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ స‌ర్కార్‌ మతం రంగును వాడుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇరాన్ పై దాడులను సమర్ధించుకునే క్రమంలో తమ సైనికులకు మత సిద్ధాంతాలను చాలా బలంగా అమెరికా ప్రభుత్వం ఎక్కించినట్లు రిపోర్ట్స్ స్పష్టం చేస్తున్నాయి. దాదాపు 40 యూనిట్ల నుంచి 110 ఫిర్యాదులు వచ్చాయి. ఈ మేరకు మిలిటరీ రిలీజియస్ ఫ్రీడమ్ ఫౌండేషన్ తాజాగా అధికారిక ప్రకటన చేసింది. బైబిల్ లో స్పష్టంగా పేర్కొన్న ఆర్మాగెడ్డాను ( చెడుపై దేవుడి యుద్ధం ) సృష్టించేందుకు ఇరాన్ పై దాడి చేయాలని జీసస్ సందేశం పంపారని, కమాండర్ అధికారులకు ట్రంప్ సర్కార్ చెప్పినట్లు రిపోర్ట్స్ స్పష్టం చేశాయి. అందుకే సైనికులు చాలా బలంగా యుద్ధంలో ముందుకు వెళుతున్నట్లు ఈ రిపోర్టు వెల్లడించింది.

ఇది ఇలా ఉండ‌గా, యుద్ధం నేపథ్యంలో ప్రాణాలు కోల్పోయిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంతక్రియలు వాయిదా పడ్డాయి. త్వరలోనే అంతక్రియల తేదీని ప్రకటిస్తామని ఇరాన్ సర్కార్ వెల్లడించింది. ఇక ఇప్పటికే అయతుల్లా అలీ ఖమేనీ జన్మించిన మషాద్ పట్టణంలో అతన్ని పూడ్చేందుకు భౌతికకాయాన్ని అక్కడికి తరలించారు అధికారులు. అయితే బుధవారం అంత్యక్రియలు జరుగుతాయని మొదట ప్రకటించినప్పటికీ... చివరి క్షణంలో వాయిదా వేశారు. దేశాల మధ్య పరస్పర దాడులు పెరిగిన నేపథ్యంలో అంతక్రియలు వాయిదా పడ్డట్లు చెబుతున్నారు.

Next Story