నన్ను త్వరలోనే అరెస్ట్ చేయొచ్చు.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు

by Disha Web |
నన్ను త్వరలోనే అరెస్ట్ చేయొచ్చు.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు
X

న్యూఢిల్లీ: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో రెండు మూడు రోజుల్లో తనను అరెస్ట్ చేస్తారని శనివారం తెలిపారు. మనీ సంబంధించిన కేసులో జిల్లా మన్హట్టన్ అటార్నీ కార్యాలయం దర్యాప్తు చేసినట్లు చెప్పారు. తన అరెస్టును వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. అయితే మన్హట్టన్ జిల్లా అటార్నీ కార్యాలయం అధికారులు తనకు సమాచారం ఇచ్చారని ట్రంప్ పేర్కొన్నారు. 2016 ముందు ఓ పోర్న్ స్టార్ తో సంబంధాన్ని బయట పెట్టకుండా ఉంచేందుకు డబ్బులు ఇచ్చారనే ఆరోపణలపై మన్హట్టన్ జిల్లా అటార్నీ దర్యాప్తు చేపట్టారు. అయితే రాజకీయ కుట్ర కోణంలో చేస్తున్నారని ట్రంప్ విమర్శించారు.
Next Story

Most Viewed