ప్రపంచశాంతికి గొప్పరోజు.. పశ్చిమాసియాలో సువర్ణోధ్యాయం : ట్రంప్

by Naga Rani Yarlagadda |

యుద్ధాన్ని ఆపడంపై ట్రంప్ మరోసారి స్పందించారు. ఈ సీజ్ ఫైర్ పశ్చిమ ఆసియాలో సువర్ణోధ్యాయాన్ని లిఖిస్తుందన్నారు.

ప్రపంచశాంతికి గొప్పరోజు.. పశ్చిమాసియాలో సువర్ణోధ్యాయం : ట్రంప్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇరాన్ పై రెండువారాలపాటు కాల్పుల విరమణకు ఒప్పుకోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పందించారు. ప్రపంచశాంతికి ఇది గొప్పరోజని మీడియా సమావేశంలో తెలిపారు. అలాగే పశ్చిమ ఆసియాలో ఇదొక సువర్ణోధ్యాయం కాబోతోందన్నారు. ఇరాన్ కు ఇక చాలు అని అనిపించిందని.. యుద్ధం పేరు ప్రస్తావించకుండా పేర్కొన్నారు. ఇక ఇరాన్ టెహ్రాన్ నిర్మాణాన్ని ప్రారంభించుకోవచ్చన్నారు. హార్ముజ్ జలసంధి రీఓపెన్ కోసం ప్రపంచదేశాలన్నీ ఎదురుచూస్తున్న క్రమంలో.. తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఆ జలసంధి మీదుగా అన్ని రవాణాలు సజావుగా జరిగేందుకు అమెరికా బలగాలు ఉంటాయన్నారు. అన్నీ సవ్యంగా జరిగేందుకు అమెరికా మద్దతు పూర్తిగా ఉంటుందన్నారు. ఇరాన్ కు మున్ముందు మంచిరోజులు ఉన్నాయని తెలిపారు. ఈ కాల్పుల విరమణ ఒప్పందం వెనుక చైనా హస్తం కూడా ఉందా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఆ విషయం తన దృష్టికి కూడా వచ్చిందని, అది నిజమేనని అనుకుంటున్నట్లుగా చెప్పారు.

Next Story