10 ఇరాన్‌ మైన్ లేయింగ్ బోట్లు ధ్వంసం.. ట్రంప్ ప్ర‌క‌ట‌న‌

by velandi.Saikiran |

ఇరాన్ కు చెందిన పది మైన్ లేయింగ్ బోట్ల‌ను ధ్వంసం చేసినట్లు సంచలన ప్రకటన చేశారు ట్రంప్.

10 ఇరాన్‌ మైన్ లేయింగ్ బోట్లు ధ్వంసం.. ట్రంప్ ప్ర‌క‌ట‌న‌
X

దిశ‌, వెబ్ డెస్క్: ఇరాన్ పై నిన్నటి నుంచి అమెరికా, ఇజ్రాయెల్ విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇరాన్ కు సంబంధించిన చాలా మంది సైనికులు చనిపోవడం కాకుండా తీవ్రస్థాయిలో నష్టం జరిగింది. ఇక దీనిపై తాజాగా ట్రంప్ కీలక ప్రకటన కూడా చేశారు. ఇరాన్ కు చెందిన పది మైన్ లేయింగ్ బోట్ల‌ను ధ్వంసం చేసినట్లు సంచలన ప్రకటన చేశారు ట్రంప్. హార్ముజ్ జల సంధిలో మైన్స్‌ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించే షిప్ ల‌ను నాశనం చేస్తామని మరో వార్నింగ్ ఇచ్చారు.

ఇరాన్ ఇంధన కేంద్రాలపై దాడులు ఆపాలి

ఇరాన్ ఇంధన కేంద్రాలపై దాడులు ఆపాలని ఇజ్రాయెల్ ను అమెరికా కోరినట్లు అంతర్జాతీయ మీడియా స్పష్టం చేసింది. ఇరాన్ ఆయిల్, ఎనర్జీ సదుపాయాలపై మరిన్ని దాడులు చేస్తే ఆ దేశ ప్రజలకు హాని కలుగవచ్చని పేర్కొంది. ఆయిల్ ధరలు భారీగా పెరగవచ్చని అమెరికా చెప్పినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అలాగే గల్ఫ్ దేశాల ఎనర్జీ సదుపాయాలపై ఇరాన్ ప్రతీకార దాడులు చేసే అవకాశం ఉందని కూడా అంచనా వేసింది. అయితే యుద్ధం తర్వాత ఆయిల్ సెక్టార్ రే ఆ దేశ సహకారం అవసరమని అమెరికా పేర్కొంది.

Next Story