వెనక్కి తగ్గిన ట్రంప్.. ఆ దేశాలపై సుంకాలు ఎత్తివేత!

by Gantepaka Srikanth |   (  Updated:2025-04-07 15:01:38  IST  )

అమెరికా(America) అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) సుంకాల నిర్ణయం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపిస్తోంది.

వెనక్కి తగ్గిన ట్రంప్.. ఆ దేశాలపై సుంకాలు ఎత్తివేత!
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా(America) అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) సుంకాల నిర్ణయం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపిస్తోంది. ఈ సుంకాలతో ఇతర దేశాలతో పాటు అమెరికా కూడా తీవ్రంగా నష్టపోతుందని ఆర్థిక నిపుణులు బహిరంగంగానే చెబుతున్నారు. మరోవైపు అమెరికా వ్యాప్తంగా ఈ టారీఫ్‌(Tariffs)లకు వ్యతిరేకంగా ఆందోళనలు కూడా మొదలయ్యాయి. దీంతో డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పలు దేశాలపై సుంకాలను ఎత్తివేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దాదాపు 90 రోజుల పాటు ఈ టారిఫ్‌లు నిలిపివేయాలని ఇప్పటికే ఆ దేశ అధికారులకు ఇంటర్నల్ సమాచారం కూడా ఇచ్చినట్లు సమాచారం. చైనా మినహా మిగిలిన దేశాలపై టారిఫ్‌లు ఎత్తివేసే ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

ఆర్థిక మండలి సలహాతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ట్రంప్(Trump) తీసుకున్న ఈ నిర్ణయంపై చైనా వ్యంగ్యంగా స్పందించిన విషయం తెలిసిందే. టారిఫ్‌లపై చైనా ఓ వీడియోను రూపొందించింది. ఇందులో అమెరికాపై పరోక్ష విమర్శలు చేసింది. ‘ట్రంప్‌ పాలక వర్గం గొప్పగా చెప్పుకొంటున్న లిబరేషన్‌ డే అంటే.. చాలా మంది అమెరికన్ల జీతాలు తగ్గించడం. ఖర్చులు పెంచడం’ అని ఎద్దేవా చేసింది. మరోవైపు ట్రంప్‌ సుంకాల నిర్ణయాలతో అమెరికా స్టాక్‌మార్కెట్లు దారుణంగా నష్టపోయాయి. ఆసియా, ఆస్ట్రేలియా మార్కెట్లు కూడా తీవ్రంగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. దాదాపు అనేక దేశాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.

Read More..

Trump: ట్రంప్ టారీఫ్ ఎఫెక్ట్.. తైవాన్, వియాత్నం కొత్త ప్రాతిపదికలు ఇవే..

Next Story