ఫ్రస్ట్రేషన్‌లో డొనాల్డ్ ట్రంప్..హర్మూజ్‌ పై యూట‌ర్న్‌

by velandi.Saikiran |   (  Updated:2026-03-23 21:30:15  IST  )

ఇరాన్ అధ్యక్షుడితో కలిసి.. తాను హార్ముజ్ జలసంధిని కంట్రోల్ చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు ట్రంప్.

ఫ్రస్ట్రేషన్‌లో డొనాల్డ్ ట్రంప్..హర్మూజ్‌ పై యూట‌ర్న్‌
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఫ్రస్ట్రేషన్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. తాను అనుకున్నట్టు ఇరాన్‌పై పట్టు సాధించలేకపోవడంతో ఫ్రస్ట్రేషన్‌లో తలాతోక లేని వ్యాఖ్యలు చేస్తున్నారు ట్రంప్. ఇరాన్ నాయ‌క‌త్వంతో కలిసి.. తాను హర్మూజ్ జలసంధిని కంట్రోల్ చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ లీడర్లతో మాట్లాడి యుద్ధానికి బ్రేక్ ఇచ్చామని అంటూనే.. మళ్లీ ఇరాన్ లీడర్లు ఎవరూ లేరంటూ కామెంట్స్ చేశారు.

అటు మొన్న‌టి వ‌ర‌కు ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబాను చంపేస్తాన‌ని ప్ర‌క‌టించి, ఇప్పుడు అత‌నితో క‌లిసి హర్మూజ్ జలసంధిని కంట్రోల్ చేస్తానని ప్ర‌క‌టించారు ట్రంప్‌. ఇక అటు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనపై ఇరాన్‌ కౌంటర్ ఇచ్చింది. అమెరికాతో ఎలాంటి చర్చలు జరగలేదని తెలిపింది ఇరాన్ మిలిటరీ. తమ ప్రతికార దాడులకు అమెరికా అధ్యక్షుడు భయపడ్డాడంటూ ప్రకటన చేసింది. అస‌లు ట్రంప్ ను న‌మ్మ‌కూడ‌ద‌ని పేర్కొంది.

Next Story