ఇజ్రాయెల్, హమాస్ శాంతి ప్రణాళికను వివరించిన డొనాల్డ్ ట్రంప్

by Malleboina Mahesh |

ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో కలిసి జరిగిన సంయుక్త ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వారి శాంతి ప్రణాళికను వివరించారు.

ఇజ్రాయెల్, హమాస్ శాంతి ప్రణాళికను వివరించిన డొనాల్డ్ ట్రంప్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu)తో కలిసి జరిగిన సంయుక్త ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వారి శాంతి ప్రణాళిక (peace plan)ను వివరించారు. ట్రంప్ ప్రకారం.. హమాస్ ఆ ప్రణాళికను అంగీకరిస్తే ఇజ్రాయేల్ (Israel) ఆధీనంలో ఉన్న బందీలు 72 గంటల్లో విడుదల చేయబడతారని ట్రంప్ ప్రకటించారు. అలాగే ఇజ్రాయెల్ గాజా యుద్ధానికి తక్షణమేగా ముగింపు తీసుకొస్తుందని ఈ సందర్భంగా ట్రంప్ చెప్పాడు. అరబ్, ముస్లిం దేశాలు గాజాను డిమిలిటరైజ్ చేసి హమాస్‌ (Hamas) సహా ఇతర ఉగ్రసంస్థల సైనిక సామర్థ్యాన్ని వెంటనే రద్దు చేయాలని పత్రాల ద్వారా కట్టుబడి ఉన్నట్లు, నెట్‌వర్క్‌లు, గుహలతో సహా ఉగ్ర వసతులను ధ్వంసించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.

ట్రంప్ అన్నట్లు, అన్ని పార్టీల మధ్య దశల వారీ ఇజ్రాయెల్ ఉపసంహరణకు టైమ్లైన్ కోసం ఒప్పుకుందని, పురోగతి ఉంటే కాలపరిమాణంలో రక్షణ చర్యలు తగ్గుతాయని ఆయన ఆశించారు. అరబ్ దేశాలను హమాస్‌ను ఎదుర్కోనే కార్యాచరణకు అవకాశం ఇవ్వాలని ఆయన సూచించారు. అవే కాకపోతే అక్కడి ఒప్పందం బైటైతే ఇజ్రాయెల్‌కు యుద్ధాన్ని పూర్తిచేయడానికి పూర్తి ఆమోదంతో అమెరికా మద్దతు ఉండబోతుందని స్పష్టం చేశారు. ఇక విజయవంతం కోసం తమ ప్రణాళికలో 'బోర్డ్ ఆఫ్ పీస్' అని పిలువబడే ఒక అంతర్జాతీయ పర్యవేక్షక మండలి ఏర్పాటు చేసి దానిని ఆయననే నేతృత్వం వహించనున్నట్లు ట్రంప్ ఈ సందర్భంగా ప్రకటించారు. దీంతో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న మారణహోమానికి ముంగిపు పడినట్లు తెలుస్తుంది.

Next Story