- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరో నాలుగు వారాల యుద్ధం చేస్తాం- డొనాల్డ్ ట్రంప్
మూడు లేదా నాలుగు వారాల యుద్ధం అనుకున్నాం.. కానీ ఇంకా ఎక్కువ సమయం పట్టొచ్చు అని ప్రకటించారు డొనాల్డ్ ట్రంప్.

దిశ, వెబ్ డెస్క్: ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఇలాంటి తరుణంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. మూడు లేదా నాలుగు వారాల యుద్ధం అనుకున్నాం.. కానీ ఇంకా ఎక్కువ సమయం పట్టొచ్చు అని ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇరాన్ కు అణ్వాయుధాలు దక్కనివ్వబోమని కూడా తెలిపారు.
స్పష్టమైన లక్ష్యాలతో ఇరాన్ దేశంపై దాడులు చేస్తున్నట్లు వెల్లడించారు. మొదటగా ఇరాన్ మిస్సైల్ సామర్థ్యాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తున్నామని వివరించారు. అలాగే ఆ దేశ నేవీని నాశనం చేస్తున్నామని వెల్లడించారు. ఇప్పటికే 10 యుద్ధ నౌకలను ధ్వంసం చేసినట్లు కీలక ప్రకటన చేశారు ట్రంప్. ఇక ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాల్లో అగ్రస్థానంలో ఉన్న ఇరాన్ కు ఎప్పటికీ కూడా అణ్వాయుధం దక్కకుండా చేయడమే తమ మూడో లక్ష్యమని ట్రంప్ వెల్లడించారు.






