మురుగున్ సదస్సులో ద్రావిడియన్ నేతలపై వివాదాస్పద వీడియోపై డీఎంకే సీరియస్

by Shamantha N |

తమిళనాడు మధురైలో జరిగిన మురుగన్ భక్తుల సదస్సు సందర్భంగా ద్రావిడ ఉద్యమ నేతలు సీఎన్ అన్నాదురై, ఈవీ రామస్వామి (పెరియార్) ని ఓ వీడియోలో అవమానించారని డీఎంకే ఆరోపించింది

మురుగున్ సదస్సులో ద్రావిడియన్ నేతలపై వివాదాస్పద వీడియోపై డీఎంకే సీరియస్
X

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడు మధురైలో జరిగిన మురుగన్ భక్తుల సదస్సు సందర్భంగా ద్రావిడ ఉద్యమ నేతలు సీఎన్ అన్నాదురై, ఈవీ రామస్వామి (పెరియార్) ని ఓ వీడియోలో అవమానించారని డీఎంకే ఆరోపించింది. ఆ ఆరోపణల నేపథ్యంలో అన్నాడీఎంకే (AIADMK) పార్టీ తమ వైఖరిని స్పష్టంగా ప్రకటించింది. హిందూ మున్నాని, బీజేపీ మద్దతుతో జూన్ 23న మధురై లో నిర్వహించారు. ఈ సమావేశానికి అన్నాడీఎంకె నేతలు సెల్లూర్ రాజు, రాజేంద్ర బాలాజీ హాజరయ్యారు. ఈ సభలో పెరియార్, అన్నాదురైపై ప్రదర్శితమైన వీడియో వివాదాస్పదంగా ఉండటంతో దిద్దుబాటు చర్యలకు అన్నాడీఎంకే ఉపక్రమించింది. మురుగన్ సదస్సులో చూపించిన దృశ్యాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు అన్నాడీఎంకే ప్రకటించింది. కొంతమంది నేతలు ఈ వీడియో ప్రసారం గురించి చెప్పకుండానే సభలో పాల్గొన్నారని చెప్పింది. ద్రావిడియన్ సిద్ధాంతం, తమ పార్టీ కార్యకర్తల రక్తంలోనే ఉందని ద్రావిడ విధానాలకు వ్యతిరేకంగా సభలో ఎలాంటి తీర్మానాలు చేయలేదని పేర్కొంది. ద్రావిడ వారసత్వాన్ని తాము గౌరవిస్తామని తెలిపింది.

అన్నా తీసేసి ‘అమిత్ షా’ అని పెట్టుకుంటారా

ఈ నేపథ్యంలో డీఎంకే నేత భారతి తీవ్ర అన్నాడీఎంకే పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ‘అన్నాడీఎంకె ఇప్పుడు ‘అన్నా’ను తీసేసి ‘అమిత్ షా’ అని పెట్టుకుంటుందా? మురుగన్ సమావేశం తర్వాత, ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది వేడుకల్లో పాల్గొని ఎడప్పాడి పళనిస్వామి నాగ్‌పూర్‌కి వెళ్లిపోతాడా? అని ప్రశ్నించారు. అన్నాడీఎంకె హిందుత్వంలో కలిసిపోయింది’ అంటూ ఆరోపించారు.

Next Story