వైట్హౌస్లో దీపావళి వేడుకలు.. దీపం వెలిగించి శుభాకాంక్షలు తెలిపిన ట్రంప్

by Ajay Maddhiboyina |

అమెరికాలోని వైట్ హౌస్‌లో దీపావళి వేడుకలు జరిగాయి. ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ దీపం వెలిగించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భగా.. తనకు మోడీ గొప్ప స్నేహితుడు అంటూ మరోసారి ప్రశంసలు కురిపించారు.

వైట్హౌస్లో దీపావళి వేడుకలు.. దీపం వెలిగించి శుభాకాంక్షలు తెలిపిన ట్రంప్
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికాలోని వైట్ హౌస్‌లో దీపావళి వేడుకలు జరిగాయి. ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ దీపం వెలిగించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భగా.. తనకు మోడీ గొప్ప స్నేహితుడు అంటూ మరోసారి ప్రశంసలు కురిపించారు. దీపావ‌ళి అంటే చీకటిపై వెలుతురు, అజ్ఞానంపై జ్ఞానం, చెడుపై మంచి విజ‌యం అని ట్రంప్ వ్యాఖ్యానించారు. త‌న‌కు భార‌తీయులు అంటే ఇష్టం అని తెలిపారు. ప్ర‌ధాని మోడీతో ఈ రోజు తాను మాట్లాడాన‌ని చెప్పారు. త‌మ మ‌ధ్య మంచి సంబంధాలు ఉన్నాయ‌ని అన్నారు. ఇరు దేశాల మ‌ధ్య ఒప్పందాల‌కు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయని తెలిపారు. అంతే కాకుండా ర‌ష్యా నుండి భార‌త్ ముడి చ‌మురు కొనుగోలు చేయ‌డంలేదని, త‌న‌లానే మోడీ కూడా యుద్ధం ఆగిపోవాల‌ని కోరుకుంటున్నార‌ని చెప్పారు. ఇదిలా ఉంటే ట్రంప్ భార‌త్ దిగుమ‌తుల‌పై భారీగా సుంకాలు విధించిన సంగ‌తి తెలిసిందే.

Next Story