- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వెనిజులాలో భూకంపంలో 1,430కి చేరిన మృతుల సంఖ్య.. శిథిలాల కింద వేలాది మంది
వెనిజులాలో భూకంప బీభత్సం.. 1,430కి చేరిన మృతుల సంఖ్య.. నేలమట్టమైన వందలాది భవనాలు, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్!

దిశ, వెబ్ డెస్క్: దక్షిణ అమెరికా దేశమైన వెనిజులాలో జూన్ 24 సాయంత్రం 6:04 గంటలకు కేవలం 39 సెకన్ల వ్యవధిలోనే రెండు శక్తివంతమైన భూకంపాలు (7.2 మరియు 7.5 తీవ్రతతో) ఒకదాని వెనుక ఒకటిగా విరుచుకుపడ్డాయి. ఈ జంట శక్తివంతమైన భూకంపాలు సృష్టించిన బీభత్సానికి మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,430కి చేరినట్లు అధికారిక వర్గాలు ధృవీకరించాయి. వందలాది భవనాలు కుప్పకూలడంతో వేలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోండగా.. వేలాది మంచి మిస్సింగ్ అయినట్లు తెలుస్తుంది.
కొనసాగుతున్న సహాయక చర్యలు..
భూకంప తీవ్రతకు రాజధాని కారకాస్‌తో పాటు పలు ప్రధాన నగరాల్లోని నివాస సముదాయాలు నేలమట్టమయ్యాయి. కూలిపోయిన భవనాల శిథిలాల కింద ఇంకా వందలాది మంది చిక్కుకుని ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని సహాయక బృందాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సైన్యం, విపత్తు నిర్వహణ సిబ్బంది రాత్రింబవళ్లు శ్రమిస్తూ శిథిలాలను తొలగిస్తున్నారు. క్షతగాత్రులను హుటాహుటిన సమీప ఆసుపత్రులకు తరలించారు. నగరాల్లో విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా స్తంభించిపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. అంతర్జాతీయ సమాజం వెనిజులాకు మానవతా సహాయం అందించేందుకు ముందుకు వస్తోంది.






