- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Dawood Ibrahim: దావుద్ పాకిస్తాన్‌లో ఉన్నాడు: ఇక్బాల్ కస్కర్
న్యూఢిల్లీ: అండర్‌వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం పాకిస్తాన్‌లో ఉన్నట్లు అతని సోదరుడు ఇక్బాల్ కస్కర్ గురువారం తెలిపాడు..Latest Telugu News

X
న్యూఢిల్లీ: అండర్‌వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం పాకిస్తాన్‌లో ఉన్నట్లు అతని సోదరుడు ఇక్బాల్ కస్కర్ గురువారం తెలిపాడు. 2021 జూన్‌లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) కస్టడీలో ఉన్న ఇక్బాల్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ జరిపింది. ఈ విచారణలో దావుద్‌తోపాటు చోటా షకీల్, అనీస్ ఇబ్రామీలు ఉంటున్న ప్రదేశం గురించి ఇక్బాల్ జాతీయ దర్యాప్తు సంస్థకు తెలిపాడు.
అలాగే ముంబై బాంబు పేలుళ్లలో నిందితుడైన జావేద్ చిక్కా గురించి కూడా ముఖ్యమైన విషయాలను బహిర్గతం చేశాడు. జావేద్ పాకిస్తాన్‌లో డ్రగ్స్ స్మగ్లింగ్ చేసేవాడని ఎన్‌ఐఏకు తెలిపాడు. అలాగే దావుద్ మేనల్లుడు అలీషా పార్కర్ కూడా దావుద్ కరాచీలో ఉంటున్నట్లు చెప్పాడు.
పండుగల సమయంలో దావుద్ తన భార్య మెహజాబిన్ ఇబ్రహీంతో ఫోన్‌లో మాట్లాడేవాడని పేర్కొన్నాడు.
Next Story






