Keir Starmer: భారత్‌లో బ్రిటిష్ ప్రధాని పర్యటన ఖరారు..

by Ramesh Naini |

భారత్‌లో యూకే (బ్రిటిష్) ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ పర్యటన ఖరారు అయింది.

Keir Starmer: భారత్‌లో బ్రిటిష్ ప్రధాని పర్యటన ఖరారు..
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత్‌లో యూకే (బ్రిటిష్) ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ (Keir Starmer) పర్యటన ఖరారు అయింది. ప్రధాని మోడీ (Modi) ఆహ్వానం మేరకు ఆయన భారత్‌లో తన తొలి అధికారిక పర్యటన చేయనున్నారు. ఈ నెల 8, 9 తేదీల్లో కీర్‌ స్టార్మర్ పర్యటన చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వ అధికారుల సమాచారం. తన పర్యటనలో ప్రధాని మోడీతో వాణిజ్యం, సాంకేతిక, రక్షణ రంగాలపై చర్చించనున్నారు. భారత్-యూకే మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యాన్ని 2030 నాటికి 120 అమెరికా బిలియన్ డాలర్లకు రెట్టింపు చేయడమే లక్ష్యంగా ముందడుగు వేయనున్నారు. రెండు దేశాలు చారిత్రాత్మక సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (సెటా) 2026 నుంచి అమల్లోకి వస్తుందని భావిస్తున్నారు. బ్రిటిష్ ప్రధాని పర్యటన భారత్-యూకే సంబంధాలలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలవనుందని భావిస్తున్నారు. ఇరు దేశాల మధ్య పెట్టుబడి అవకాశాలకు ఈ పర్యటన ఉపయోగపడనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు.

Next Story