- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Flash News : దలైలామాకు గ్రామీ అవార్డు
ప్రముఖ బౌద్ధ, టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామాను ప్రతిష్ఠా్త్మకమైన గ్రామీ అవార్డు వరించింది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ బౌద్ధ, టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామాను ప్రతిష్టాత్మకమైన గ్రామీ అవార్డు వరించింది. ఈసారి ఆయన ‘గ్రామీ విజేత’గా నిలిచి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఫిబ్రవరి 1న జరిగిన 68వ గ్రామీ అవార్డుల ప్రీ-సెరిమనీ కార్యక్రమంలో “Meditations: The Reflections Of His Holiness The Dalai Lama” అనే ఆడియో బుక్‌కు గాను ఉత్తమ ఆడియో బుక్, నరేషన్, స్టోరీటెల్లింగ్ విభాగంలో ఈ అవార్డు గెలుచుకున్నారు. 90 ఏళ్ల వయసులో ఈ గౌరవాన్ని అందుకున్న దలైలామా, దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ సరసన తొలి సారి గ్రామీ విజేతగా నిలిచారు.
ఈ అవార్డును దలైలామా తరఫున ప్రముఖ సంగీతకారుడు రూఫస్ వేన్‌రైట్ స్వీకరించారు. యూట్యూబ్‌లో ప్రసారమైన కార్యక్రమంలో వేదికపై మాట్లాడిన ఆయన.. “నేను దలైలామా కాదు.. కానీ ఈ ప్రాజెక్ట్‌లో భాగమవడం గౌరవంగా భావిస్తున్నాను. ఆయన జ్ఞానమే ఈ కృతికి ప్రాణం” అంటూ వ్యాఖ్యానించారు.
ఈ విభాగంలో దలైలామాకు గట్టి పోటీ ఎదురైంది. మిల్లీ వానిల్లీ సభ్యుడు ఫ్యాబ్ మోర్వాన్, అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తి కేటంజీ బ్రౌన్ జాక్సన్, గ్రామీ కార్యక్రమ నిర్వాహకుడు ట్రెవర్ నోవా వంటి ప్రముఖులు కూడా ఈ అవార్డుకు పోటీపడ్డారు. ఈ ఆల్బమ్‌లో హిందుస్తానీ శాస్త్రీయ సంగీత ప్రభావంతో రూపొందిన పాటలు ఉన్నాయి. మైండ్‌ఫుల్‌నెస్, సామరస్యం, ఆరోగ్యం వంటి అంశాలపై దలైలామా వ్యాఖ్యలు ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ప్రాజెక్ట్‌లో మాగీ రోజర్స్, ఆండ్రా డే వంటి ప్రముఖ గాయకులు కూడా పాల్గొన్నారు. ఈ విజయం ద్వారా ఆధ్యాత్మికత, సంగీతం, సందేశం కలిసిన అరుదైన ప్రయత్నానికి ప్రపంచస్థాయిలో గుర్తింపు లభించినట్లైంది.






