చైనాలో కరోనా విజృంభణ.. హస్సిటల్‌లో బెడ్లు లేక నేలపైనే CPR చికిత్స..

by Disha Web Desk 12 |
చైనాలో కరోనా విజృంభణ.. హస్సిటల్‌లో బెడ్లు లేక నేలపైనే CPR చికిత్స..
X

దిశ, వెబ్‌డెస్క్: చైనాలో కరోనా మహమ్మారి మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా అధిక జనాభా కలిగిన ప్రముఖ నగరాల్లో కరోనా రోగుల సంఖ్య భారీగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే తమ దేశంలో ఇటువంటి పరిస్థితి ఉన్నప్పటికి ఆ దేశ ప్రభుత్వం మాత్రం చాలా సైలెంట్ గా ఎటువంటి వార్తలు బయటకు రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటుంది. కాగా ప్రస్తుతం చైనాలో పరిస్థితి మనం అనుకున్న దానికంటే చాలా దారుణంగా ఉంది. దీనికి సంబంధించి ఆసుపత్రుల నుంచి రోగులు భయంకరమైన వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ట్విట్టర్‌లో పంచుకున్న వీడియో క్లిప్‌లో, కరోనా సోకిన వారికి వైద్యం అందించి అలసిపోయిన వైద్యులు, అలాగే రోగులకు చికిత్స అందించడానికి సరైన బెడ్లు లేక కొంతమంది ఫ్లోర్ పైన పడుకోబెట్టి CPR చికిత్స అందిస్తుండటం కనిపిస్తుంది. అలాగే మరో వీడియో లో చాలా మంది వైద్యులు అలసట, అధిక పని కారణంగా నిద్రపోతున్నట్లు కనబడింది.

Next Story

Most Viewed