హార్ట్ ఎటాక్ డెత్ లకు కొవిడ్ వ్యాక్సిన్లు కారణం కాదు: ఐసీఎంఆర్

by Shamantha N |

కొవిడ్ వ్యాక్సిన్ వేసుకోవడం వల్లే సడెన్ హార్ట్ స్టోక్ లతో చనిపోతున్నారనే అపోహలకు కేంద్రం, ఐసీఎంఆర్, ఎయిమ్స్ వివరణ ఇచ్చాయి.

హార్ట్ ఎటాక్ డెత్ లకు కొవిడ్ వ్యాక్సిన్లు కారణం కాదు: ఐసీఎంఆర్
X

దిశ, నేషనల్ బ్యూరో: కొవిడ్ వ్యాక్సిన్ వేసుకోవడం వల్లే సడెన్ హార్ట్ స్టోక్ లతో చనిపోతున్నారనే అపోహలకు కేంద్రం, ఐసీఎంఆర్, ఎయిమ్స్ వివరణ ఇచ్చాయి. ఐసీఎంఆర్, ఎయిమ్స్ సంస్థలు చేపట్టిన పరిశోధనల్లో కొవిడ్ వ్యాక్సిన్ కు గుండెపోటుకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాయి. ఇటీవలి కాలంలో దేశంలో 45 ఏళ్ల లోపు చాలా మంది వ్యక్తులు కార్డియాక్ అరెస్టు తో చనిపోతున్నారు. దీంతో ఆయా వ్యక్తుల్లో గతంలో ఉన్న అనారోగ్య కారణాలే గుండెపోటులకు కారణమై ఉండొచ్చని తెలిపింది. దీనికి సంబంధించిన అధ్యయనాల రిపోర్టును కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసింది.

జన్యు పరమైన లోపాలే కారణామా?

ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌), నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (ఎన్‌సీడీసీ), ఎయిమ్స్ 2023 మే-ఆగస్టు మధ్య 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రీసెర్చ్ నిర్వహించాయి. ఇందులో ఆకస్మిక మరణాలకు కొవిడ్ వ్యాక్సిన్ కు ఎలాంటి సంబంధం లేదని గుర్తించినట్లు తెలిపాయి. కొవిడ్ వ్యాక్సిన్లు అత్యంత సురక్షితమైనవని వాటి వల్ల ఎలాంటి దుష్ఫ్రరిమాణాలు లేవని తేల్చి చెప్పారు. గుండె పోటుతో చనిపోతున్న వారిలో జన్యు పరమైన ఇబ్బందులు, గతంలో ఉండే అనారోగ్య సమస్యలు కారణం కావొచ్చని పేర్కొన్నాయి. ఈ మధ్య బాలీవుడ్ నటి షెపాలీ జరివల్ మృతితో మరోసారి కొవిడ్ వ్యాక్సిన్లపై చర్చ మొదలైంది. కానీ ఈ టీకాలు వేసుకోవడం వల్లే కొవిడ్ నుంచి చాలా మంది ప్రాణాలు కాపాడుకున్నారని.. అనవసరంగా లేనిపోని పుకార్లతో వ్యాక్సిన్ల విశ్వసనీయతను దెబ్బతీయొద్దని రీసెర్చ్ సంస్థలు చెబుతున్నాయి.

Next Story