- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Myanmar: స్విమ్మింగ్ పూల్లో ప్రేమ జంట.. గర్భిణికి పార్కులో డెలివరీ.. భూకంప సిత్రాలు వైరల్
మయన్మార్, బ్యాంకాక్, థాయిలాండ్‌లో శుక్రవారం భూకంపం సంభవించిన విషయం తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో: మయన్మార్, బ్యాంకాక్, థాయిలాండ్‌లో శుక్రవారం (Earthquake) భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. (Myanmar)మయన్మార్‌లో భారీ భూకంపం సంబవించడంతో వందల కొద్ది భవనాలు కుప్పకూలాయి. శిథిలాల కింద జనాలు పిట్టల్లా నలిగిపోయారు. ముఖ్యంగా ఆకాశాన్ని అంటే భవనాలపై ఉన్న జనాలు తీవ్ర భయ బ్రాంతులకు గురయ్యారు. చాలా భవనాల రూఫ్ టాప్‌లపై ఏర్పాటు చేసిన స్విమ్మింగ్ ఫూల్లలోని నీరు.. భూ ప్రకంపనలతో ఒక్కసారిగా భవనం పై నుంచి స్విమ్మింగ్ ఫూల్ నీరు జలపాతంలా కిందకు జారాయి. కింద ఉన్న ప్రజలు సైతం ఒక్కసారిగా నీరు పడడంతో ప్రజలకు గాయాలయ్యాయి. ఈ క్రమంలోనే పలు వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. సీసీ ఫుటేజ్ వీడియోలో కనిపించిన ఓ వీడియో ప్రకారం.. భవనం రూఫ్ టాప్‌పై స్విమ్మింగ్ ఫూల్లో ప్రేమజంట హాయిగా సేద తీరుతోంది. అయితే ఒక సారిగా భూమి కంపించడంతో బిల్డింగ్ ఊగిపోయింది. ఒక్కసారిగా భూకంపం రావడంతో ప్రేమ జంట భయబ్రాంతులకు గురై స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు వచ్చేస్తారు. సముద్రంలో అలల మాదిరిగా.. స్విమ్మింగ్ ఫూల్ నీరు బయటకు వచ్చే ఫోర్స్‌కు వారికి చుక్కలు కనబడుతాయి. చివరికి అక్కడి నుంచి తప్పించుకొని ప్రాణాలతో బయట పడతారు.
అదే విధంగా బ్యాంకాక్ భూకంప ఘటనలో మరో వీడియో వైరల్‌గా మారింది. ఆసుపత్రిలో పురిటి నొప్పులతో ఓ గర్భిణికి బాధపడుతుంది. అదే సమయంలో ఒక్కసారిగా భూకంపం రావడంతో గర్భినీని వెంటనే స్ట్రెచర్‌పై వీధుల్లోకి తీసుకెళ్లి పార్క్ వద్ద డెలివరీ చేస్తారు. వీడియోలో తల్లి బిడ్డా క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరో వీడియోలో చిన్న పిల్లల వార్డులో నర్సులు చేసిన సహాసానికి అందరూ అభినందనలు తెలుపుతున్నారు. భూ ప్రకంపణలు వచ్చినప్పుడు నర్సులు బయటకు పారిపోకుండా చిన్న పిల్లల వార్డులో ఇద్దరు నర్సులు చిన్నారులను కాపాడే ప్రయత్నం చేస్తారు. కొద్ది సేపటికి భూ ప్రకంపణలు ఆగిపోవడంతో వారు ఊపిరిపీల్చుకుంటారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగనట్లుగా వీడియోలో కన్పిస్తోంది.
కాగా, మయన్మార్‌కు భూకంపానికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. తాజా అప్డేట్ ప్రకారం.. మయన్మార్ భూకంపంలో మృతుల సంఖ్యం వేయికి పైగా చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ భూకంపం 1600 మందికి పైగా గాయాలు అయినట్లు సమాచారం. భారీ భవనాలు కుప్పకూలిపోవడంతో.. శిథిలాల కింద వందలాది మంది కార్మికులు, ప్రజలు చిక్కుకున్నారు. వారిని ప్రాణాలతో రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మయన్మార్‌లో శుక్రవారం 7.7 తీవ్రతతో భూకంపం వచ్చింది.






