- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కర్నాటక సర్కార్ కీలక నిర్ణయం
కర్నాటక సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మళ్లీ కులగణన నిర్వహించాలని నిర్ణయించింది.

దిశ, వెబ్ డెస్క్: కర్నాటక సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మళ్లీ కులగణన నిర్వహించాలని నిర్ణయించింది. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోగా మళ్లీ కులగణన నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రకటించారు. కర్నాటకలో చివరిసారిగా 2015లో సిద్దరామయ్య సీఎంగా ఉన్న సమయంలో కుల సర్వే నిర్వహించారు. ఈ సర్వే వివాదాస్పదమైంది. ఈ సర్వేను అనేక వర్గాల ప్రజలు వ్యతిరేఖించారు.
ఇక ఈ ఏడాది ఏప్రిల్ లో అధికారికంగా సమర్పించబడిన డేటాలో వోక్కలిగ, వీరశైవ-లింగాయత్ వర్గాలు మరియు ఇతర వెనుకబడిన వర్గాల మధ్య అంతరాలను మరింత పెంచింది. దీంతో పలు వర్గాల వాళ్లు డిమాండ్ చేయడంతో అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది. అంతే కాకుండా 60 నుండి 80 రోజుల్లో తిరిగి కులగణన పూర్తి చేయాలని అధిష్టానం కర్నాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్రం జనాభా గణన షెడ్యూల్ ప్రకటించిన వెంటనే కర్నాటక ప్రభుత్వం కూడా మరోసారి కులగణన చేపట్టాలని ఆలోచిస్తోంది.






