- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘోర ప్రమాదం.. వంతెన కూలి 32 మంది మృతి
by Naga Rani Yarlagadda |
వంతెన కూలి 32 మంది చనిపోయిన విషాద ఘటన ఆఫ్రికా దేశమైన కాంగోలో చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: వంతెన కూలి 32 మంది చనిపోయిన విషాద ఘటన ఆఫ్రికా దేశమైన కాంగోలో చోటుచేసుకుంది. రాగి గనిలోని వంతెన కూలడంతో ఈ దుర్ఘటన జరిగింది. బ్రిడ్జి కూలిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. లువాలాబా ప్రావిన్స్ లోనికలాండో సైట్లో శనివారం ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. మైనింగ్ జరుగుతున్న ఈ సైట్లో ప్రతిరోజూ వందలాది కార్మికులు పనిచేస్తుంటారు. అక్కడ కాల్పుల శబ్దం వినిపించగా.. కార్మికులు ఒక్కసారిగా వంతెనపై నుంచి పరుగులు తీయడంతో కెపాసిటీకి మించిన లోడ్ కారణంగా వంతెన కూలిపోయినట్లు మైనింగ్ ఏజెన్సీ పేర్కొంది. కాంగోలో ఈ రాగి మైనింగ్ ఆధారంగా 15-20 మంది ప్రజలు ఉపాధి పొందుతున్నారు. కాగా.. కనీస భద్రతా చర్యలు లేకపోవడంతో ఇప్పటికే అనేకమంది ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు చెప్తున్నాయి.
Next Story






