- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > దేశం-విదేశం > ప్రపంచం > Indian Air Force: మిడిల్‌ఈస్ట్‌లో ఘర్షణలు! రంగంలోకి దిగిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్
Indian Air Force: మిడిల్‌ఈస్ట్‌లో ఘర్షణలు! రంగంలోకి దిగిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్
by Ramesh Naini |
ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా దాడులు చేయడంతో మిడిల్‌ఈస్ట్‌లో ఘర్షణ వాతవరణం నెలకొంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఇరాన్ అణు స్థావరాలపై (America) అమెరికా దాడులు చేయడంతో మిడిల్‌ఈస్ట్‌లో ఘర్షణ వాతవరణం నెలకొంది. ఇప్పటికే ఇరాన్-ఇజ్రాయెల్ (Iran-Israel) పరస్పరం దాడులకు దిగడంతో అక్కడ నివసించే భారత పౌరులు, విద్యార్థులు భారత్‌కు చేరుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా (West Asia) పశ్చిమాసియాలోని ఘర్షణ ప్రభావిత ప్రాంతాల్లో పెరిగిన ఉద్రిక్తతలకు ప్రతిస్పందనగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (Indian Air Force) రంగంలోకి దిగింది. ఐఏఎఫ్ (IAF) C-17 విమానం ద్వారా జోర్డాన్, ఈజిప్ట్ దేశాల్లో ఉన్న దేశ పౌరులను భారత్‌కు తరలిస్తోంది. భారతీయ పౌరుల కోసం అత్యవసరమైన సమయాల్లో దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత పౌరులకు సహాయం చేయడానికి ఐఏఎఫ్ కట్టుబడి ఉందని ఇవాళ ఎక్స్ వేదికగా ఫోటోలను షేర్ చేసింది.
Next Story






