- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వింటర్ ఒలింపిక్స్‌లో 'కండోమ్స్' కొరత! మూడు రోజుల్లోనే 10 వేల ప్యాకెట్లు ఖాళీ!
ఒలింపిక్ క్రీడా గ్రామంలో (Athletes' Village) అథ్లెట్ల కోసం అందుబాటులో ఉంచిన కండోమ్‌లు రికార్డు స్థాయిలో ఉపయోగించినట్లు తెలుస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: సాధారణంగా ఒలింపిక్స్ అంటే రికార్డులు, పతకాల వేట గుర్తుకు వస్తుంది. కానీ, ఇటలీ వేదికగా జరుగుతున్న 2026 మిలాన్-కోర్టినా వింటర్ ఒలింపిక్స్‌లో ప్రస్తుతం ఒక వింత సమస్య హాట్ టాపిక్‌గా మారింది. ఒలింపిక్ క్రీడా గ్రామంలో (Athletes' Village) అథ్లెట్ల కోసం అందుబాటులో ఉంచిన కండోమ్‌లు రికార్డు స్థాయిలో ఉపయోగించినట్లు తెలుస్తోంది. నిర్వాహకులు సరఫరా చేసిన 10 వేల కండోమ్ ప్యాకెట్లు కేవలం మూడు రోజుల్లోనే ఖాళీ అయినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
కొత్త స్టాక్ తెప్పించే ప్రయత్నం
కోర్టినా డి అంపెజోలోని విలేజ్‌లో సుమారు 2,900 మంది అథ్లెట్లు ఉంటున్నారు. వీరి కోసం నిర్వాహకులు ముందు జాగ్రత్తగా దాదాపు 9,700 ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు. అయితే, ఆటలు మొదలైన మూడు రోజుల్లోనే స్టాక్ మొత్తం అయిపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం కొత్త స్టాక్ తెప్పించే పనిలో ఉన్నట్లు సమాచారం. కండోమ్‌ల కొరత రావడానికి నిర్వాహకుల ప్రణాళికా లోపమే కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత పారిస్ ఒలింపిక్స్ (2024లో 10,500 మంది అథ్లెట్ల కోసం ఏకంగా 2.20 లక్షల కండోమ్‌లను పంపిణీ చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. కానీ మిలాన్ వింటర్ ఒలింపిక్స్ (2026)లో కేవలం 10 వేల ప్యాకెట్లను మాత్రమే కేటాయించడం డిమాండ్ పెరగడానికి కారణమైనట్లు తెలుస్తోంది.
కండోమ్స్ పంపిణీ ఎందుకు?
ఒలింపిక్ క్రీడా గ్రామంలో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన వేలాది మంది అథ్లెట్లు కొన్ని వారాల పాటు కలిసి ఉంటారు. ఈ క్రమంలో సురక్షితమైన శృంగారం, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించే సంప్రదాయం చాలా కాలంగా కొనసాగుతోంది. టోక్యో ఒలింపిక్స్‌లో కోవిడ్ ఆంక్షల కారణంగా సాన్నిహిత్యంపై నిషేధం విధించారు. ప్రస్తుతం ఆ నిబంధనలు లేకపోవడంతో అథ్లెట్ల మధ్య పరస్పర కలయికలు పెరిగాయి. ప్రస్తుతానికి పరిస్థితిని చక్కదిద్దేందుకు యుద్ధ ప్రాతిపదికన కొత్త స్టాక్ ఆర్డర్ చేసినట్టు ఒలింపిక్ కమిటీ నిర్వాహకులు చెబుతున్నారు. క్రీడలు ముగిసే వరకు అథ్లెట్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని నిర్వాహకులు హామీ ఇచ్చారు.






