Gold Mine Collapse : కుప్పకూలిన బంగారు గని.. 42 మంది సజీవ సమాధి

by M.Rajitha |
Gold Mine Collapse : కుప్పకూలిన బంగారు గని.. 42 మంది సజీవ సమాధి
X

దిశ, వెబ్ డెస్క్ : బంగారు గని కుప్పకూలిన(Gold Mine Collapse) ఘటనలో 42 మంది సజీవ సమాధి అయ్యారు. పశ్చిమ ఆఫ్రికాలో(West Africa)ని మాలి(Mali) దేశంలో శనివారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది. అధికారుల వివరాల ప్రకారం.. చైనా దేశస్థుల నిర్వహణలో ఉన్న గనిపై ఒక్కసారిగా కొండచరియలు విరిగి(Land Slides) పడగా.. ఒక్కసారిగా గనిలో చాలభాగం కుప్పకూలి పోయింది. ప్రాథమిక సమాచారం ప్రకారం 42 మంది అక్కడిక్కడే మృతి చెందగా.. అనేక మందికి తీవ్ర గాయాలయ్యాయి. వందల మంది శిథిలాల కింద చిక్కుకు పోయారు. అయితే ఈ గనికి అనుమతులు ఉన్నాయా లేదా అనే విషయాన్ని అధికారులు వెల్లడించలేదు. కాగా నెల రోజుల వ్యవధిలో ఆఫ్రికాలో చోటు చేసుకున్న రెండవ అతి పెద్ద ప్రమాదం ఇది. జనవరిలో కోలికోరో ప్రాంతంలో బంగారు గని కూలీ 70 మంది దాకా మృతి చెందారు. అదేవిధంగా 2024 జనవరిలో కూడా మాలిలోని బంగారు గనిలో ప్రమాదం జరిగి పదుల సంఖ్యలో మరణించారు. అయితే మాలి జనాభాలో 10 శాతం కంటే ఎక్కువమంది బంగారం మైనింగ్ పైన ఆధార పడి జీవిస్తుంటారు. మరో విషాదం ఏమిటంటే ఇక్కడ జరిగే ప్రమాదాలన్నిటిలో ఎక్కువగా మహిళలే గని ప్రమాదాల్లో మరణిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Next Story

Most Viewed