సముద్రంలో నాట్లు వేసి.. బియ్యం ఉత్పత్తి చేసి..

by Sujitha Rachapalli |

చైనాలో జనాభా పెరిగిపోతోంది. పంట పండించే వ్యవసాయ భూమి తగ్గిపోతుంది. జనాభాకు సరిపడ తిండి గింజలు ఉత్పత్తి చేయడం కష్టంగా మారే పరిస్థితి ఏర్పడనుంది. ఈ క్రమంలో చైనా శాస్త్రవేత్తలు గొప్ప ఆవిష్కరణ చేశారు.

సముద్రంలో నాట్లు వేసి.. బియ్యం ఉత్పత్తి చేసి..
X

దిశ, వెబ్ డెస్క్ : చైనాలో జనాభా పెరిగిపోతోంది. పంట పండించే వ్యవసాయ భూమి తగ్గిపోతుంది. జనాభాకు సరిపడ తిండి గింజలు ఉత్పత్తి చేయడం కష్టంగా మారే పరిస్థితి ఏర్పడనుంది. ఈ క్రమంలో చైనా శాస్త్రవేత్తలు గొప్ప ఆవిష్కరణ చేశారు. భూమిపై మాత్రమే కాకుండా సముద్రంలో పంటలు పండించడంపై పరిశోధనలు జరిపి సక్సెస్ అయ్యారు. సముద్రంలో నాటు వేసి వరిని ఉత్పత్తి చేయడంలో విజయాన్ని సాధించారు. తీరప్రాంత లవణ నేలల్లో పెరిగే ఉప్పును టోలరేట్ చేసే సముద్ర బియ్యాన్ని పండించగలిగారు.

ఈ ప్రాజెక్టును చైనీస్ వ్యవసాయ శాస్త్రవేత్త యువాన్ లాంగ్‌పింగ్ ప్రారంభించారు. పలు హైబ్రిడ్ బియ్యం రకాలను సృష్టించిన ఆయన.. సముద్ర బియ్యాన్ని అభివృద్ధి చేయడంలో కీలకపాత్ర పోషించారు. నిజానికి ఆ దేశంలో సుమారం 100 మిలియన్ హెక్టార్ల లవణ-క్షార నేలలు ఉన్నాయి. కానీ ఇవి సంప్రదాయ వ్యవసాయానికి అనువుగా లేవు. దీంతో ఆహార భ్రదతను మెరుగుపరిచేందుకు.. ఈ భూములను ఉత్పాదకంగా మార్చేందుకు ఈ ప్రయోగాన్ని స్టార్ట్ చేశారు. అయితే యువాన్ లాంగ్‌పింగ్ 2021లో చనిపోయాక.. కింగ్‌డావో లవణ-క్షార సహన బియ్యం పరిశోధన కేంద్రం (Qingdao Saline-Alkali Tolerant Rice Research Centre) ఈ ప్రాజెక్టు బాధ్యతలు తీసుకుంది. ఈ సముద్ర బియ్యం రకం ఎకరానికి 4.6 నుంచి 9.3 మెట్రిక్ టన్నుల దిగుబడిని ఇవ్వగలదని తెలిపింది. షాన్‌డాంగ్, హైనాన్, జియాంగ్సు, మరియు ఇతర తీరప్రాంత ప్రాంతాల్లో ప్రయోగాలు కొనసాగుతుండగా.. ఈ సాంకేతికతను ఆఫ్రికా, దక్షిణాసియాలో వినియోగించేందుకు ప్రయత్నాలు చేస్తోంది చైనా. కాగా 2024 నాటికి 4,00,000 హెక్టార్లలో సముద్ర బియ్యం సాగు చేయగా.. ఈ ఏడాది 6,67,000 హెక్టార్లకు విస్తరించే ప్రణాళికలు ఉన్నాయి.

Next Story