- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వందేళ్ల నాటి గణిత చిక్కుముడులు విప్పిన చైనా మేధావులు.. ప్రతిష్టాత్మక ‘ఫీల్డ్స్ మెడల్’ కైవసం
గణిత శాస్త్రంలో నోబెల్ బహుమతికి సమానంగా భావించే అత్యున్నత పురస్కారం ‘ఫీల్డ్స్ మెడల్’ను తొలిసారిగా ఇద్దరు చైనా దేశస్థులు కైవసం చేసుకున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: గణిత శాస్త్రంలో నోబెల్ బహుమతికి సమానంగా భావించే అత్యున్నత పురస్కారం ‘ఫీల్డ్స్ మెడల్’ను తొలిసారిగా ఇద్దరు చైనా దేశస్థులు కైవసం చేసుకున్నారు. వందేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది మేధావులు ఛేదించలేని అత్యంత క్లిష్టమైన సమస్యలను పరిష్కరించినందుకు గాను చైనాకు చెందిన హాంగ్ వాంగ్ (35), యూ డెంగ్ (37) ఈ అరుదైన ఘనత సాధించారు. వీరితో పాటు అమెరికాకు చెందిన జాన్ పార్డన్, కెనడాకు చెందిన జాకబ్ సిమ్మెర్‌మాన్ కూడా ఈ పురస్కారానికి ఎంపికయ్యారు.
వారు పరిష్కరించిన సమస్యలివే..
హాంగ్ వాంగ్.. 1917లో జపనీస్ శాస్త్రవేత్త సోయిచి కకేయా లేవనెత్తిన ఓ క్లిష్టమైన సమస్యకు వాంగ్ తన సహోద్యోగి జోష్ జాల్‌తో కలిసి పరిష్కారం కనుగొన్నారు. ఒక పెన్సిల్‌ను త్రీ-డైమెన్షనల్ (3D) స్పేస్‌లో పూర్తిగా తిప్పినప్పుడు, అది ఆక్రమించే అతి తక్కువ విస్తీర్ణం ఎంత? అనే దానికి వీరు సమాధానం రాబట్టారు. యూ డెంగ్.. 1900 సంవత్సరంలో జర్మన్ శాస్త్రవేత్త డేవిడ్ హిల్బర్ట్ ప్రతిపాదించిన ‘హిల్బర్ట్స్ సిక్స్త్ ప్రాబ్లమ్’ను డెంగ్ ఛేదించారు. వాయువుల ప్రవర్తనను అధ్యయనం చేయడం ద్వారా వ్యక్తిగత కణాల కదలికల ఆధారంగా మొత్తం వ్యవస్థ ప్రవర్తనను ఎలా లెక్కించవచ్చో ఆయన నిరూపించారు.
అవార్డు విశేషాలు, ప్రశంసల వెల్లువ:
40 ఏళ్ల లోపు అసాధారణ ప్రతిభ కనబరిచిన గణిత శాస్త్రవేత్తలకు నాలుగేళ్లకోసారి ఈ ఫీల్డ్స్ మెడల్ అందజేస్తారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్న మూడో మహిళగా హాంగ్ వాంగ్ చరిత్ర సృష్టించారు. అవార్డు కింద విజేతలకు 15,000 కెనడియన్ డాలర్ల (సుమారు రూ. 8.8 లక్షలు) చొప్పున బహుమతి ప్రదానం చేశారు. వాంగ్, డెంగ్ ఇద్దరూ 2007లో చైనాలోని పీకింగ్ యూనివర్సిటీలో చేరారు. ఆ తర్వాత విదేశాల్లో (ఎంఐటీ, ప్రిన్స్‌టన్ తదితర) ఉన్నత విద్యను అభ్యసించారు. ప్రస్తుతం వాంగ్ న్యూయార్క్ యూనివర్సిటీలో, డెంగ్ చికాగో యూనివర్సిటీలో ప్రొఫెసర్లుగా సేవలందిస్తున్నారు.
సోషల్ మీడియాలో ట్రెండింగ్
చైనీయులు తొలిసారి ఈ అవార్డు గెలవడంతో ఆ దేశ సోషల్ మీడియా వేదికలైన ‘వీబో’, ‘రెడ్‌నోట్’లలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ‘ఇది చైనీయులందరికీ గర్వకారణం’, ‘మనం చరిత్రను చూస్తున్నాం’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ వాంగ్‌కు స్వయంగా ఫోన్ చేసి అభినందనలు తెలపడం విశేషం.






