- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హోంమంత్రి అనిత ‘ఎక్స్’ ఖాతా హ్యాక్.. అలర్ట్ జారీ చేసిన అధికారులు
by Ramesh Naini |
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి అనిత వ్యక్తిగత ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాను ఆగంతుకులు హ్యాక్ చేశారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి అనిత వ్యక్తిగత ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాను ఆగంతుకులు హ్యాక్ చేశారు. ఆమె అకౌంట్ నుంచి అనధికారిక పోస్టులు వస్తున్నట్లు గుర్తించిన అధికారులు వెంటనే అప్రమత్తమై అలర్ట్ జారీ చేశారు. ప్రస్తుతం ఆ ఖాతాలో వస్తున్న పోస్టులను అధికారిక సందేశాలుగా పరిగణించవద్దని హోంమంత్రి కార్యాలయం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఈ ఘటనపై హోంమంత్రి అనిత అనకాపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు, సైబర్ క్రైమ్ ఐజీ రవికృష్ణతో ఫోన్లో మాట్లాడారు. ఉద్దేశపూర్వకంగానే ఈ హ్యాకింగ్ జరిగినట్లు భావిస్తున్న సైబర్ క్రైమ్ పోలీసులు.. ఖాతా రికవరీకి చర్యలు ముమ్మరం చేశారు. నిందితులను పట్టుకునేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు స్పష్టం చేశారు.
Next Story






