- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యుతరం ప్రశ్నిస్తోంది.. యువత ఆందోళన వేళ మోహన్ భగవత్ వ్యాఖ్యలు వైరల్
ఢిల్లీలో పరీక్షల లీకేజీ నిరసనల వేళ ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు చర్చగా మారాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: నీట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహరంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‍తో దేశ రాజధాని ఢిల్లీలో యువత చేపట్టిన ఆందోళనలు పీక్స్ కు చేరిన వేళ RSS చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సమాజంలో మారుతున్న యువత ఆలోచన విధానంపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొత్త తరం ప్రతి విషయాన్ని ప్రశ్నిస్తోందని అందువల్ల ఈ యువతకు ఆజ్ఞలు, ఆదేశాలు కాకుండా సరైన వివరణ, ఆప్యాయత అవసరమని ఆయన పేర్కొన్నారు. తాజాగా విశ్వ మంగళ్య సభ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తాము యువకులుగా ఉన్న సమయం పూర్తిగా విధేయతతో కూడుకున్నదని కానీ నేడు ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయన్నారు.
ఆ బాధ్యత పెద్దలదే:
నేటి తరం యువత నమ్మకాన్ని గెలుచుకోవడానికి ఆదేశాలు జారీ చేయడం కాకుండా వారితో చర్చలు జరపడం, తర్కంతో వివరించాల్సి ఉందన్నారు. ఈ బాధ్యత పిల్లల తల్లిదండ్రులపై ఉందన్నారు. అలాగే కుటుంబాల్లోనూ పరస్పర సంభాషణలు తగ్గిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల పిల్లలతో పెద్దలు మరింత అప్యాయంగా మెలగాలని వారి కోసం సమయం కేటాయించాలన్నారు. అయితే జంతర్ మంతర్ వద్ద సీజేపీ (CJP) ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యార్థుల ఆందోళనల గురించి భగవత్ ప్రత్యక్షంగా ప్రస్తావించకపోయినా ఢిల్లీ ఆందోళనల నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి.






