- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహారాష్ట్ర టెట్ పేపర్ లీక్ కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్
మహారాష్ట్ర టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రధాన నిందితుడైన బీజేంద్ర కుమార్ గుప్తాను భివండి పోలీసులు బీహార్‌లో అరెస్ట్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర సంచలనం సృష్టించిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) పేపర్ లీకేజీ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన బీజేంద్ర కుమార్ గుప్తా (Bijendra Kumar Gupta)ను భివండి పోలీసులు బీహార్‌లో అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుడిని విమానంలో పూణే విమానాశ్రయానికి తరలించారు. అక్కడి నుంచి అతడిని తదుపరి విచారణ నిమిత్తం భివండికి తీసుకెళ్లనున్నట్లు పోలీసులు తెలిపారు. టెట్ పరీక్ష (Tet test) పత్రాల లీకేజీ తో వేలాది మంది అభ్యర్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన ఈ కేసులో నిందితుడి అరెస్ట్ కీలక మలుపు గా మారింది. ఈ పేపర్ లీక్ వ్యవహారంలో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న బీజేంద్ర గుప్తా అరెస్ట్‌తో ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. విచారణ అనంతరం ఈ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న మరికొందరిని కూడా అరెస్ట్ చేసేందుకు పోలీసులు చర్యలు వేగవంతం చేశారు.






