- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సిసింద్రీ లాభాలతోనే బ్లూ క్రాస్ ప్రారంభమైంది.. ఆసక్తికర విషయాలు పంచుకున్న అఖిల్
'సిసింద్రీ' సినిమా లాభాలతోనే మా అమ్మ బ్లూ క్రాస్ సంస్థను ప్రారంభించారని అక్కినేని అఖిల్ వెల్లడించారు.

దిశ, వెబ్ డెస్క్: అక్కినేని అఖిల్ దాదాపు 8–9 నెలల వయసులోనే 'సిసింద్రీ' చిత్రంలో ప్రధాన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో పాటు భారీ లాభాలను అందుకుంది. అంతేకాకుండా, ఈ చిత్రంలో తన నటనకు అఖిల్‌కు ఫిలింఫేర్ అవార్డు కూడా లభించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అఖిల్, 'సిసింద్రీ' చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ... నాకు 8–9 నెలల వయసు ఉన్నప్పుడే 'సిసింద్రీ' సినిమాలో నటించాను. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించి భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ఆ లాభాలతోనే మా అమ్మ బ్లూ క్రాస్ సంస్థను ప్రారంభించింది. ఆ సినిమా సమయంలో నాపై ఎలాంటి రిస్క్ తీసుకోకూడదని మా నాన్న భావించారు.
అందుకే అత్యంత సన్నిహితుల సహకారంతోనే చిత్రీకరణ చేపట్టాం. నేను రోజుకు దాదాపు నాలుగు గంటలు మాత్రమే మెలకువగా ఉండేవాడిని. ఆ సమయంలో కూడా నా మూడ్ బాగుంటేనే షూటింగ్ చేసేవారు. సినిమాలో నేను నవ్వాల్సిన సన్నివేశాల్లో కెమెరా వెనుక మా నాన్న నిలబడి సైగలు చేస్తే నేను నవ్వేవాడిని. అలాగే ఏడవాల్సిన సన్నివేశాల్లో మా అమ్మ కారు ఎక్కి వెళ్లిపోతే, అది చూసి నేను ఏడ్చేవాడిని. వాటిని చిత్రబృందం క్యాప్చర్ చేసేది. ఇలా ఎన్నో వినూత్న పద్ధతులతో 'సిసింద్రీ' చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ సినిమా భారీ విజయాన్ని సాధించడమే కాకుండా, నాకు ఫిలింఫేర్ అవార్డును కూడా అందించింది. అది నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన చిత్రం అని అఖిల్ చెప్పుకొచ్చారు.






